Indian Cricket Team: డిసెంబర్ నెలలో టీమిండియా బంగ్లాదేశ్ తో 3 వన్డేలు, 2 టెస్టులు ఆడడానికి బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. అయితే ఈ మేరకు బీసీసీఐ జట్టుకు ఎంపికైన ఆటగాళ్ల లిస్టును విడుదల చేసింది. మొదటగా టీమిండియా డిసెంబర్ నెల మొదటి వారంలో 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు 3 వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ నుండి సూర్య కుమార్ యాదవ్ కు విశ్రాంతినిచ్చింది. 3-మ్యాచ్‌ల వన్డే సిరీస్ కు యష్ దయాల్ & రవీంద్ర జడేజాల స్థానంలో ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్, ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్‌లను ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
దయాల్‌కు వెన్నెముక గాయం వెంటాడుతుండగా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయం నుండి ఇంకా కోలుకోలేదు. వారిపై BCCI వైద్య బృందం పర్యవేక్షణ కొనసాగుతుంది. న్యూజిలాండ్‌లో నవంబర్ 25న ఆక్లాండ్‌లో ప్రారంభమయ్యే 3-మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కుల్దీప్ మరియు షాబాజ్‌లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అయితే, వారు ఇప్పుడు బంగ్లాదేశ్‌కు వెళ్లే జట్టులో కూడా భాగం కానున్నారు.
మరోసారి వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు మొండి చేయి..!
మరోవైపు బంగ్లాదేశ్ పర్యటనకు వికెట్ కీపర్ సంజూ శాంసన్ ను ఎంపిక చేయకపోవడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. అద్భుతమైన బ్యాటింగ్ సగటు కలిగి ఉన్న సంజూ శాంసన్ కు బీసీసీఐ రాజకీయాలే శాపంగా మారాయని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఎవరైనా గాయపడితే వారి స్థానంలో సంజూ శాంసన్ ఆడించే అవకాశాలు లేకపోలేదని కొందరు ఆశాభావం వ్యక్తం చేశారు.
Indian Cricket Team:
బంగ్లాదేశ్ లో పర్యటించే వన్డే జట్టు ఇదే:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, దీపక్ చహర్, కుల్దీప్ సేన్.