హాలీవుడ్ సినిమాలు అంటే సీక్వెల్స్ అంటే కంటే ఫ్రాంచైజ్ ఫార్మాట్ బాగా కనిపిస్తుంది. హాలీవుడ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి చేరువ అయినా మార్వెల్ సిరీస్ లో వచ్చే సూపర్ హీరో చిత్రాలన్నీ కూడా ఫ్రాంచైజ్ మూవీస్ అంటారు. వాటిని ముందుగా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో, డిఫరెంట్ సూపర్ హీరోలతో తెరకెక్కించి తరువాత మల్టీవర్స్ గా వారందరిని ఒకే సినిమాలోకి తీసుకొచ్చి చూపిస్తారు. అందరూ కలిసి ప్రత్యర్థులతో యుద్ధం చేసినట్లు ఆవిష్కరిస్తారు. హాలీవుడ్ లో ఈ రకమైన మల్టీవర్స్ కథలకి ఫుల్ డిమాండ్ ఉంది. అన్ని సినిమాలలో పాత్రలని కలిపి ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చి కథలు చెప్పడం అనేది కొత్తదనం కొరుకునే ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుంది. అయితే ఇలాంటి జోనర్ లో సినిమాలు చేసే సమయంలో చాలా వర్క్ చేయాలి. స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా సెట్ కావాలి.
అదే సమయంలో కంటెంట్ కూడా పవర్ ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు ఇండియన్ సినిమాలలో లోకేష్ కనగరాజ్ ఈ రకమైన జోనర్ లోనే సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఖైదీ సినిమాలో క్లైమాక్స్ కి విక్రమ్ స్టోరీలో క్లైమాక్స్ ని లింక్ చేశాడు. నెక్స్ట్ ఖైదీ 2, తరువాత విక్రమ్ 2 మూవీస్ కూడా లోకేష్ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ప్రస్తుతం విజయ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలోనే మెయిన్ ఎలిమెంట్ ని ఆ ఖైదీ, విక్రమ్ కథలకి లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవి అయిన తర్వాత హీరోలు అందరిని కలిపి మల్టీవర్స్ కాన్సెప్ట్ తో మూవీ చేయాలని అనుకుంటున్నాడు.
దీనికి లోకేష్ యూనివర్స్ అనే పేరు కూడా పెట్టాడు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీలో క్లైమాక్స్ ని సీక్వెల్ కి లీడ్ ఇచ్చే విధంగా విడిచిపెట్టాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమా చేస్తున్నాడు. తరువాత తారక్ తో కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ కథతోనే బ్లాక్ షెడ్ లో మూవీ చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలలో హీరోల పాత్రలని కలిపి ఒక కొత్త కాన్సెప్ట్ తో మర్వెల్ తరహా ప్రయోగం చేయాలని కేజీఎఫ్ నిర్మాతలు భావిస్తున్నారు. దాంతో పాటు ఇప్పుడు నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ లో వస్తున్న హిట్ మూవీ సీక్వెల్స్ లో ఒక్కో స్టోరీకి ఒక్కో హీరోని పెట్టుకొని ఫైనల్ గా అందరి హీరోలతో మల్టీ స్టారర్ కథాంశంతో ఒక మూవీ ప్లాన్ చేయాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇలా ఇలా సినిమాలలో హీరోల పాత్రలని మాత్రమే తీసుకొని, అందరిని కలిపి ఒక కొత్త సినిమా చేయడం మల్టీవర్స్ మూవీస్ అంటారు. ఇప్పుడు ఇండియన్ సినిమాలలో కూడా అదే రకమైన చైన్ సిస్టమ్ ని తీసుకొచ్చే ప్రయత్నం దర్శక, నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందనేది చూడాలి.