India VS Pak: క్రికెట్‌లో దాయాదుల పోరుగా పిలువబడే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు అటు రెండు దేశాల అభిమానులలోనే కాక ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. రెండు జట్లు ఎలాగైనా గెలవాలని స్టేడియంలో ఆడుతుంటే క్రికెట్ ఫ్యాన్స్ కూడా తమ దేశం ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని నరాలు తెగే ఉత్కంఠతతో మ్యాచ్‌ను వీక్షిస్తుంటారు. అయితే ఈ రెండు జట్ల మధ్య కేవలం ఐసీసీ మెగా ట్రోఫీలలోనే మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఎప్పటినుండే ఇండియా-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ను ప్లాన్ చెయ్యాలని చూస్తున్న బోర్డర్‌లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వలన అది కుదరడం లేదు. అయితే ఎప్పటి నుండే ఈ రెండు జట్ల మధ్య పోరు కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఆ సమయం మరెంతో దూరంలో లేదు. దాయాదుల పోరుకు సమయం దగ్గరపడుతుంది.
వరల్డ్ కప్ షెడ్యూల్:
ఈ నెల 16న టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ముందుగా గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లతో పోటీలు ప్రారంభకానున్నాయి. ఈ స్టేజ్‌లో శ్రీలంక్, నబేబియా, యూఏఈ, వెస్టిండీస్, నెదర్లాండ్, స్కాట్లండ్, జింబాబ్బే, ఐర్లాండ్ పాల్గొంటాయి. ఈ మ్యాచ్‌లను ఆస్ట్రేలియాలోని 7 ప్రధాన నగరాల్లో నిర్వహిస్తారు. అసలైన సూపర్ 12 మ్యాచ్‌లు 22నుండి ప్రారంభం కానున్నాయి. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది.
అయితే ఎన్ని దేశాలు తలపడతున్నప్పటికీ అందరి చూపు ఇండియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ మీదే ఉంది. అక్టోబర్ 23న ఈ మ్యాచ్ జరగనుంది. ఆరోజు భారత్ పాక్ జట్లు ఈ టోర్నీలో మొదటిసారి తలపడనున్నాయి. ఈ హైటెన్షన్ మ్యాచ్ కోసం రెండు దేశాల క్రీడాభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ మ్యాచ్‌ను అందరికీ సెలవు దినమైన ఆదివారం రోజు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ టీ20 ప్రపంచ కప్‌కు మొత్తం 6,00,000 కంటే ఎక్కువగా టిక్కెట్లు అమ్ముడయ్యయని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది.
India VS Pak:
మెల్‌బోర్న్ వేదికగా జరిగే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఇప్పటికే 90,000 టికెట్లు అమ్ముడయ్యాని అధికారులు ప్రకటించారు. అంటే కేవలం ఈ రెండు దేశాలు తలపడే మ్యాచ్‌తోనే లక్ష టికెట్లు అమ్ముడుపోవడం చూస్తుంటే ఈ మ్యాచ్ పట్ల క్రికెట్ అభిమానులలో ఎంత ఆశక్తి ఉందో తెలుసుకోవచ్చు. అందుకే ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడింది.