ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో జరిగిన అన్ని మ్యాచ్ లలోనూ విజయం సాధించిన భారత్ తొలిసారి పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది.మ్యాచ్ కు ముందు ఇరు దేశాల సీనియర్స్ వ్యాఖ్యలతో హిట్ పెరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్స్ పూర్తి అయ్యేసరికి ఏడు వికెట్లు నష్టానికి 151 పరుగులు చేసింది.152 పరుగుల లక్ష్యంతో చేజ్ కు దిగిన పాకిస్తాన్ 17.5 ఒవర్స్ లో వికెట్లు కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించి పది వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది.
దీంతో ఎప్పటి నుండో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు రెచ్చిపోతూ కామెంట్స్ చేస్తున్నారు.దీంతో బాగా హార్ట్ అయిన భారత్ క్రికెట్ అభిమానులు ఒక పక్క పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు కౌంటర్ ఇస్తూ మరోపక్క ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణాలను ఎత్తి చూపుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో అభిమానులు ఎత్తి చూపుతున్న ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈసారి టి20 టోర్నీని నిర్వహించే బాధ్యతను తీసుకున్న బిసిసిఐ మ్యాచ్ లను ఇండియాలో కాకుండా పాకిస్తాన్ సెకండ్ హోంగా పరిగణించే యు.ఏ.ఈ లో నిర్వహించారు.అక్కడ పిచ్ లపై ఆడిన అనుభవం ఉన్న పాకిస్తాన్ జట్టు ముందు ఐపిఎల్ లో స్వల్ప మ్యాచ్ లు ఆడిన భారత్ ఆటగాళ్ళు తేలిపోయారు.అయిన ప్రస్తుతం ప్రపంచంలో కరోనా కేసులు తక్కువగా ఉన్న దేశాలలో ముందు వరసలో ఉన్న ఇండియాలో టి20 వరల్డ్ కప్ ఎందుకు నిర్వహించలేదు అంటూ క్రికెట్ అభిమానులు బిసిసిఐపై ఫైర్ అవుతున్నారు.
ఇక రెండో కారణం విషయానికి వస్తే :
ఈ టోర్నీ వార్మప్ మ్యాచ్ లలో అద్భుతంగా రాణించిన కే.ఎల్. రాహుల్ ఈరోజు షాహిన్ అఫ్రిది వేసిన బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.అది క్లియర్ గా నో బాల్ అయినప్పటికీ థర్డ్ ఎంపైర్ అది చూడకపోవడంతో అది లీగల్ బాల్ గా పరిగణించి రాహుల్ ను ఔట్ ఇచ్చారు.దీంతో రాహుల్ 3 పరుగులకే ఔట్ అయ్యి పెవిలియన్ చేరాడు.ఈ వికెట్ పడకుండా ఉండి ఉంటే ఇండియన్ బ్యాట్స్ మెన్ పై ప్రెషర్ తగ్గి భారీ స్కోర్ చేసే అవకాశం ఉండేదని నెటిజన్స్ అంపైర్స్ పై ఫైర్ అవుతున్నారు.
ఇక కొందరు క్రికెట్ అభిమానులు భారత్ పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సీరీస్ లు ఆడడం మానేసింది దీనివల్ల పాకిస్తాన్ ఆటగాళ్ళ ఎత్తులు ,అలాగే యు.ఏ.ఈ లో వారికున్న అపార అనుభవం భారత్ ఓటమితో కీలక పాత్ర పోషించాయిని కామెంట్ చేస్తున్నారు.