IND v/s Pak: క్రికెట్ ప్రపంచమంతా ఇప్పుడు అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థులైన ఇండియా – పాకిస్తాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఈ జట్ల గురించి విపరీతమైన కామెంట్లను మనం చూస్తూ ఉన్నాం. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారనుంది. కొన్ని జట్ల మధ్య వామప్ మ్యాచులు రద్దయ్యాయి. దీంతో కొంతవరకు క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
తాజాగా ఇండియా – న్యూజిలాండ్ మధ్య జరిగే వామప్ మ్యాచ్ కూడా ఒక్క బంతి పడకుండానే రద్దయింది. ఈ మ్యాచ్ ఈ వరల్డ్ కప్ లో ఇండియా జట్టుకు చివరి వామప్ మ్యాచ్. ఇదే మైదానంలో పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన వామప్ మ్యాచ్లో వరుడు అడ్డంకిగా నిలిచాడు. అయితే అక్టోబర్ 23న పాకిస్తాన్ తో ఇదే మైదానంలో ఇండియా మ్యాచ్ ఆడనుంది. మెల్ బోర్న్ లో మ్యాచ్ సమయానికి 80% వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.
భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచే కాకుండా మరి కొన్ని మ్యాచులకు కూడా వర్షం అడ్డంకిగా మారనున్నది. ఒక విధంగా చెప్పాలంటే సూపర్ 12 పోరులో జరిగే మ్యాచులకు రిజర్వుడేలు లేవు, కేవలం సెమీఫైనల్స్, ఫైనల్స్ పోటీలకు మాత్రమే రిజర్వు డేలు ఉన్నాయి. దీంతో క్రికెట్ అభిమానులు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను చూసే అవకాశం చాలా తక్కువ. తాజాగా ఆసియా కప్ లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది.
IND v/s Pak:
ఐసీసీ ఈవెంట్లలో ఇండియా – పాకిస్తాన్ జట్ల మధ్య రద్దయిన మ్యాచ్ లు ఎక్కువగా లేవు. ఈ మెగా ఈవెంట్లలో ఇండియా పాకిస్థాన్ పై పైచేయిగా ఉంది. అక్టోబర్ 23న వాతావరణం అనుకూలించి వర్షం పడకపోతే ఇండియా – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఇండియా – పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుందని చెప్పవచ్చు.