IND v/s PAK: T20 వరల్డ్ కప్ సమరంలో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరి కొద్ది గంటల్లో భారత్ పాకిస్తాన్ మధ్య అసలైన పోరు మొదలుకానుంది. ఈ మ్యాచ్ కు ముందే ఎన్నో విశ్లేషణలు, మాటల యుద్ధాలు కొనసాగాయి. వీటన్నింటికి మరి కొన్ని గంటల్లో తెరపడనుంది. దాయాదుల మధ్య ఎంతో హీట్ పుట్టించే T20 పోరు మొదలుకానుంది. మెల్ బోర్న్ స్టేడియంలో మరియు వివిధ మాధ్యమాల ద్వారా మ్యాచ్ ను వీక్షించడానికి అభిమానులు రెడీగా ఉన్నారు.
ఇండియా – పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మెల్ బోర్న్ స్టేడియంలో సుమారుగా లక్ష మంది ఈ మ్యాచ్ ను వీక్షించే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం సరిగ్గా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 నిమిషాలకు మొదలుకానున్నది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకున్నారు.
ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని గతంలో వాతావరణ శాఖ తెలిపింది. కానీ, మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయనేది తాజా సమాచారం. ఇది క్రికెట్ అభిమానులకు కొంత ఉపశమనం కలిగించే అంశం. ఐసీసీ ఈవెంట్లలో పాకిస్తాన్ పై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఇండియా జట్టు తిరిగి అదే ప్రదర్శనను పునరావృతం చేస్తుందా లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
భారత జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్/ రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ/ హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.
IND v/s PAK:
పాకిస్థాన్ జట్టు అంచనా: మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), హైదర్ అలీ, మహ్మద్ నవాజ్, ఇఫ్తికార్ అహ్మద్, షాన్ మసూద్, అసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, నసీమ్ షా, హరీస్ రవూఫ్.