Bigg boss 6: బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఏడవ వారం ఓటింగ్ ఆసక్తికరంగా మారింది. మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్న శ్రీహాన్, ఇనయలు ఈ వారం మొదట్లో తిరిగి ఫైటింగ్ ప్రారంభించారు. శ్రీహాన్.. ఇనయను నామినేట్ చేశాడు. ఆమె వెటకారంగా ఏదో చేసిందని శ్రీహాన్ అభియోగం. ఆ తరువాత ఇనయ కూడా శ్రీహాన్‌ను నామినేట్ చేసింది. ఇక్కడి వరకూ అంతా కామన్.. కానీ వీరి ఓటింగ్ చూస్తేనే కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఒకప్పుడు అంటే మూడో వారమో ఏమో కానీ శ్రీహాన్ పిట్ట అని ఇనయను అన్నాడు.
ఆ సమయంలో ఇనయ ఓ రేంజ్‌లో రెచ్చిపోయి గొడవ చేసింది. నన్ను పిట్ట అంటావా? అని గగ్గోలు పెట్టింది. దీంతో ఇనయపై ఆడియన్స్‌లో సింపథీ వర్కవుట్ అయ్యి ఆ వారం ఆమెను ఓటింగ్‌లో టాప్ 2లో నిలబెట్టారు. రేవంత్ 1లో ఉంటే ఇనయ సెకండ్ ప్లేస్‌లో ఉంది. అదే వారం శ్రీహాన్ 5వ స్థానానికి పడిపోయాడు. అలాంటిది ఈ వారం ఓటింగ్ చాలా షాకింగ్‌గా ఉంది. రేవంత్‌ను సైతం బీట్ చేసి శ్రీహాన్ టాప్ 1 ప్లేస్‌లో కూర్చొంటే.. ఇనయ చిట్ట చివరి స్థానంలో ఉంది. ఆమె ఓటింగ్ పర్సంటేజ్ ఒక్క శాతం కావడం ఊహలకు అందని విషయం.
సూర్యతో ఆమె నడుపుతున్న వ్యవహారంతో ఇనయపై బీభత్సమైన నెగిటివిటీ వచ్చింది. పైగా హోస్ట్ నాగార్జున సైతం గేమ్ మీద నుంచి ఆమె ఫోకస్ మనుషుల వైపునకు మళ్లిందని చెప్పినా కూడా వినిపించుకోకుండా సూర్యతోనే తిరుగుతోంది. ఇది ఆడియన్స్‌కు అస్సలు నచ్చలేదు. పైగా మొన్న బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో వరస్ట్‌గా టాస్క్ ఆడిన కంటెస్టెంట్స్‌లో ఇనయ కూడా ఒకరు. దీంతో ఆమెకు మరింత నెగిటివిటీ వచ్చేసింది. పైగా శ్రీహాన్ దగ్గరకు వెళ్లి.. నువ్వు నామినేట్ చేసినా నేను చేయకుండా ఉండాల్సిందని తప్పు తనదే అన్నట్టుగా చెప్పేసింది. దీంతో ప్రేక్షకులకు ఏమనిపిస్తుంది? శ్రీహాన్ తప్పు లేదని స్వయంగా ఇనయనే ఒప్పుకుంది కాబట్టి ఇంక తాము ఆమెని వెనుకేసుకొచ్చినా ఇబ్బందే అని ఫీలవరా? మొత్తానికి అమ్మడి ఓటింగ్ ఢమాల్. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఇనయానే కావొచ్చు.