Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు శ్రీహాన్, ఇనయల మధ్య వార్ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇద్దరూ ఒకరితో మరొకరు గొడవ పడుతూనే ఉన్నారు. 7వ వారం కాస్త కూల్‌గా కనిపించిన ఇద్దరూ ఈ వారం బీభత్సంగా మాటల యుద్ధానికి పాల్పడుతున్నారు. మిషన్ పాజిబుల్ టాస్క్‌లో భాగంగా ఇతర స్క్వాడ్‌లోని సభ్యులను చంపేందుకు క్యాప్చర్ ద వార్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో శ్రీహాన్, రేవంత్, ఫైమా ఒకవైపు.. ఇనయ, వాసంతి, మెరీనాలు మరోవైపు ఉన్నారు.
ముందుగా శ్రీహాన్ ఇనయను రెచ్చగొట్టేందుకు యత్నించాడు. నామినేషన్‌లో తప్ప కంటెంట్ ఆమె దగ్గర ఉండదని.. అలాంటి ఆమె మాట్లాడటమేంటని విమర్శించాడు. దీనికి ఇనయ.. శ్రీహాన్‌ను.. ‘ఈ మధ్య నువ్వు కంటెంట్ బాగా ఇస్తున్నావ్‌లే, ఎక్కడ వెళ్లి పడుకుంటున్నావో చూస్తున్నా’ అంది. దీనికి శ్రీహాన్‌కు మండిపోయింది. టాస్క్ పూర్తయ్యాక వెళ్లి ఆమెతో గొడవకు దిగాడు. నోరు జారుతున్నావేంటంటూ మండిపడ్డాడు. క్యారెక్టర్ గురించి మాట్లాడతావా? అంటూ ఫైర్ అయ్యాడు.
తమ రిలేషన్‌కు ఓ పేరు, లిమిట్ ఉందని అని శ్రీసత్యతో కలిసి శ్రీహాన్.. ఇనయపై మండిపడ్డారు. అప్పుడు కూడా ఇనయ షాకింగ్ కామెంట్స్ చేసింది. శ్రీసత్య, శ్రీహాన్ కింద పడుకుని ఉండటం చూశానని చెప్పుకొచ్చింది. దీంతో వీరి మధ్య పెద్ద గొడవే జరిగింది. మొత్తానికి శ్రీహాన్, శ్రీ సత్యల గురించి ఒక పెద్ద అభాండమే వేసింది. ఇప్పటి వరకూ జనం వీరిద్దరూ కలిసి ఉండటం చూశారు కానీ తప్పుగా మాత్రం తీసుకోలేదు. వారిద్దరూ స్నేహితులన్నట్టుగానే చూశారు. వారిద్దరు కూడా ఎప్పుడు హద్దులు దాటి ప్రవర్తించలేదు. మరి ఇనయ మాత్రం వాళ్ల క్యారెక్టర్‌పై నింద వేసింది. దీని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.