BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో లవ్ ట్రాక్ నడిపేందుకు బిగ్ బాస్ చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. కానీ ఆ ప్రయత్నం మాత్రం ప్రతి వారం విఫలం అవుతూనే వస్తోందని చెప్పాలి. అయినప్పటికీ సూర్య, ఆరోహి మధ్య జరుగుతున్న సంభాషణను లవ్ ట్రాక్ గా మార్చేందుకు ప్రతిరోజు వస్తున్న ఎపిసోడ్స్ లో చూపిస్తూనే ఉన్నారు. కానీ సూర్య మాత్రం లవ్ ట్రాక్ కంటే ఎక్కువగా బిగ్ బాస్ టైటిల్ కొట్టాలి అనే ట్రాక్ లో పడిపోయాడు.
ఈ వారం బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుడిగా నిలిచేందుకు హోటల్ వర్సెస్ హోటల్ అనే టాస్క్ ని బిగ్ బాస్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో సూర్య తలకు దెబ్బ తగిలి గతం మరిచిపోయిన క్యారెక్టర్ పోషిస్తున్నాడు. ఇక ఇనయ సుల్తాన ఓ ధనవంతురాలి కూతురి క్యారెక్టర్ లో కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య బుధవారం ఎసిసోడ్ లో ఓ లవ్ ట్రాక్ సీన్ సాగింది. గతం మరిచిపోయిన క్యారెక్టర్ లో ఉన్న సూర్య ఎదురుగా కూర్చోని ఇనయ తన పర్ఫామెన్స్ చేస్తుంది.

బేబి మనిద్దరం లవర్స్.. నీవంటే నాకు చాలా ఇష్టం.. ఇన్ని రోజులు మనమధ్య జరిగినవి అన్ని మరిచిపోతావా.. అంటూ సూర్య, ఇనయ ఇద్దరూ ఒకరిని ఒకరు సుధీర్ఘంగా కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకంటారు. నిజంగానే నాకు నీవంటే నాకు చాలా ఇష్టం.. నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను.. చెప్పలేకపోతున్నాను.. సడెన్ గా ఇప్పుడు ఇలా మరిచిపోతా అంటే నేనెలా బ్రతకాలి.. ఒకసారి నా ప్రేమను అర్ధం చేసుకో అంటూ బాధగా అంటోంది ఇనయ.
నిజంగానే మనం ప్రేమించుకున్నామా.. మనుషులు అర్ధం చేసుకోవాడానికి ఇది మామూలు ప్రేమ కాదు అగ్నిలాగా స్వచ్చమైనది అంటూ మతిమరుపు క్యారెక్టర్ లో ఉన్న సూర్య సినిమా డైలాగ్స్ తో రెచ్చిపోతాడు. మరి టాస్క్ లో భాగంగా అయితే ఇద్దరూ ఎవరికి వారు ప్రదర్శన అదరగొట్టారు కానీ ఈ సీన్ గురించి ఆరోహి టాస్క్ తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి..!