Bigg boss 6 : ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక్క ఇన్సిడెంట్ చాలు.. కంటెస్టెంట్స్ ఫేట్ మారిపోవడానికి.. ఇలా చాలా మంది విషయంలో జరిగింది. గతంలో కూడా ఆర్జే కాజల్ ఈ వారం ఔట్ అనుకున్న సమయంలో జెస్సీ అనారోగ్య కారణాలతో బయటకు వెళ్లిపోవడంతో సేవ్ అయ్యింది. ఇక ఆ తరువాత సన్నీకి అనుకూలంగా స్టాండ్ తీసుకోవడంతో దాదాపు ఫైనల్ వరకూ కొనసాగింది.
ప్రస్తుతం ఇనయ సుల్తానా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ వారం ఔట్ అనుకున్న సమయంలో కంటెస్టెంట్స్ అంతా వ్యతిరేకమవడంతో సింపతీ వర్కవుట్ అయ్యి ఇప్పుడు రేవంత్ తర్వాత స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో ఏ రాంగ్ స్టెప్ తీసుకున్నా కూడా ఇబ్బందే. వాదనలో స్ట్రెంత్ లేకున్నా కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ.. ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది. ఇక మరోవైపు సూర్య.. ఆరోహితో కలిపిన పులిహోరకు ఇద్దరికీ నెగిటివిటీ పెరిగిపోయి.. గతవారం ఆరోహి ఎలిమినేట్ అయిపోయింది. ఇక సూర్యకు కూడా ఆరోహి కారణంగా బయట కావల్సినంత నెగిటివిటీ వచ్చేసింది.
ఇక ఇనయ – సూర్య. ఏం కాంబినేషన్‌రా బాబోయ్.. ఇనయకు ఉన్న బయట అంతో ఇంతో పాపులారిటీ ఉంది. రేవంత్ నామినేషన్స్‌లో లేకపోవడంతో టాప్‌లో నెట్టుకొస్తోంది. ఈ సమయంలో ఆచి తూచి అడుగులు వేయాల్సింది పోయి సూర్యపై క్రష్ అని చెబుతోంది. పాయే.. ఉన్న పాపులారిటీ మొత్తం పాయే.. అసలే నెగిటివిటీ ఉన్న సూర్యపై క్రష్ ఉంటే బయటకు వచ్చాక చూసుకోవాల్సింది కానీ హౌస్‌లోనే చెప్పేసి ప్రేక్షకుల దృష్టిలో ఢమాల్ అనేసింది. ఇకపై అమ్మడి ఓటింగ్ ఎలా ఉండబోతోందనేది ప్రశ్నార్ధకంగా మారింది. మొత్తానికి అమ్మడి ఓటింగ్‌కు ఈ ఒక్క మాట గండికొట్టేసినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.