Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఈ వారం రసవత్తరంగా సాగుతోంది. ఆసక్తికర విషయం ఏంటంటే ఇన్ని వారాలపాటు ఇనయ నామినేషన్స్‌లోకి వస్తే ఓటింగ్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉండేది. అది కూడా తొలి స్థానంలో ఉన్న రేవంత్‌కు దరిదాపుల్లోకి కూడా వెళ్లేది కాదు. కానీ ఈ వారం ఏకంగా రేవంత్‌ను దాటేసి షాకిచ్చింది. పోనీ ఆమె ఆట తీరు ఏమైనా అదిరిపోతుందా? అంటే అదేమీ లేదు. అలాగని ఆర్గ్యుమెంట్స్‌లో దుమ్ము దులిపేస్తుందా? అంటే అంత సీనూ లేదు.
మరి ఎందుకు ఇనయాకు ఆ రేంజ్ ఓటింగ్ వస్తోంది అంటే.. కేవలం సింపథి. హౌస్‌మేట్స్ అంతా టార్గెట్ చేస్తుంటే జనాలు సింపథితో ఓట్లు గుద్దేస్తున్నారు. ఇన్ని వారాలుగా ఆమె నామినేషన్స్‌లోకి వస్తున్నా కూడా నెట్టుకొస్తోంది అంటే ఏం జరుగుతుందోనన్న స్పృహ కూడా హౌస్‌మేట్స్‌కు లేదు. ఏ ఒక్కరూ కూడా తగ్గడం లేదు. ఏ మాత్రం అవకాశం దొరికినా రయ్‌మంటూ గొడవకు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఇనయకు ఓ రేంజ్‌లో బయట సింపథి వర్కవుట్ అవుతోంది. దీంతో ఓట్లు దారుణంగా ఆమెకు పడుతున్నాయి.
ఇక ఈ వారం కూడా ఇనయాను వరస్ట్ పెర్ఫార్మర్ ట్యాగ్‌తో జైలులో వేశారు. అసలే బయట ఆమెపై సింపథి మామూలుగా లేదు. ఈ సమయంలో వరస్ట్ పెర్ఫార్మర్ అని ముద్ర వేసి జైలుకు పంపిస్తే ఇంకేమైనా ఉంటుందా? అంతే సంగతులు. సింపథీ మరింత వర్కవుట్ అవుతుంది. ఈ హౌస్‌మేట్స్ తీరు చూస్తుంటే అంతా కలిసి కప్ తీసుకెళ్లి ఆమె చేతిలో పెట్టేసేలా ఉన్నారు. అసలే ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా సరైన కంటెస్టెంట్ లేరు. వరస్ట్ లోనే కాస్త బెటర్ ఎంచుకుని ఓటు వేస్తున్నారు జనం. ఇక ఇనయా కప్ గెలిస్తే ఇక అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదేమో.