టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మంచి అనుబంధం ఉంది అందుకే ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ దాదాపు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో చేశారు.ఇక త్రివిక్రమ్ తాజాగా లాంచ్ చేసిన ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్ లో నూతన చిత్రాలను నిర్మించే బాధ్యతను ఆయన భార్య సాయి సౌజన్యకు అప్పగించారు.
తాజాగా ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్,సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా సార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీకి వెంకి అట్లూరి దర్శకత్వం వహించనున్నారు.ఈ మూవీలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ గా కనిపించబోతున్నాడు.ఈ మూవీని దర్శకనిర్మాతలు తాజాగా అనౌన్స్ చేశారు.ఈ మూవీలో ధనుష్ లెక్చర్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.