Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయ్యి రెండో వారం చివరికి వచ్చేయడం జరిగింది. అయితే మొదటి వారానికి సంబంధించి ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరిగినా గాని నో ఎలిమినేషన్ అని ఎవరిని హౌస్ నుండి ఎలిమినేట్ చేయలేదు. ఈ క్రమంలో రెండో వారం ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ లో రేవంత్, ఫైమా, మెరీనా రోహిత్, ఆదిరెడ్డి, గీతు రాయల్, రాజశేఖర్, అభినయశ్రీ, షానీ ఉండటం జరిగింది. అయితే ఓటింగ్ ప్రకారం మరి కొద్ది గంటల్లో పోల్స్ క్లోజ్ కానున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ వారం మొన్నటిదాకా రాజశేఖర్ ఎలిమినేట్ అవుతారన్న ప్రచారం బయట బాగా జరిగింది. కానీ రాజ్ ఇప్పుడు హౌస్ కెప్టెన్ అయినట్లు వార్త లైవ్ ద్వారా తెలియటంతో .. ఒక్కసారిగా రాజ్ ఓటింగ్ గ్రాఫ్ పెరిగిపోయిందట. పైగా మనవడు వాయిస్ కూడా పెంచడంతోపాటు అందరిని ఆకట్టుకునే రీతిలో మాట్లాడుతూ ఉండటంతో.. చివరిలో ఉండాల్సిన రాజ్ ఇప్పుడు ఇద్దరినీ దాటుకుని పైకి వెళ్లిపోయాడట.
దీంతో రెండో వారం హౌస్ నుండి షానీ లేదా అభినయశ్రీ వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండోవారానికి సంబంధించి ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ ప్రకారం చివరిలో ఉన్నది షానీ. ఇదే సమయంలో షానీకి అభినయశ్రీకి మధ్య ఓటింగ్ తేడా కూడా వన్ పర్సెంట్ అన్న తరహాలో ఉంది. మరి శుక్రవారం రాత్రి లెక్కలు ఏమైనా మారితే.. అభినయశ్రీ కిందకు వస్తే ఆమె వెళ్లిపోయే ఛాన్స్ ఉంది.