Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి రెండో వారంలో అర్జున్ వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. గేమ్ పరంగా అర్జున్ చాలా తెలివిగా స్లో అండ్ స్టడీ అన్న తరహాలో ఆడుతున్నాడు. డిస్కషన్ సమయంలో కూడా పాయింట్ టూ పాయింట్ అర్థమయ్యేలా చెబుతూ ఉన్నాడు. టాస్కులు పరంగా కూడా చాలా యాక్టివ్ గానే కనిపిస్తూ ఉన్నాడు. కానీ శ్రీ సత్యతో అర్జున్ వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. బయట వీరిద్దరికీ ఆల్రెడీ పాస్ట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్లే శ్రీ సత్యానీ అర్జున్ చాక్లెట్ అడిగినట్లు.. దానికి సత్య ఇవ్వలేదని అంటున్నారు.
ఇంకా ఇదే సమయంలో శ్రీ సత్యనీ చెల్లి అనాలి అంటూ రేవంత్… చెప్పిన సమయంలో అర్జున్ చాలా ఫీల్ అయ్యాడు. ఇక ఇదే కారణాన్ని అర్జున్ మనసులో పెట్టుకుని కొంతమంది దగ్గర డిస్కషన్ పెట్టడం జరిగింది. రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో.. రేవంత్ నీ నామినేట్ చేసినట్లు లేటెస్ట్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోపక్క శ్రీసత్య దానికి హౌస్ లో అందరూ అన్నయ్యలు లాంటివారని అంటూ ఉంది. మంగళవారం జరిగిన ఎపిసోడ్ స్టార్టింగ్ లో సైతం.. శ్రీ సత్య, వాసంతి నీ సిస్టర్స్ అని పిలవాలని … అర్జున్ కి రేవంత్ చెప్పిన సందర్భం మళ్ళీ డిస్కషన్ కి వచ్చింది. దీంతో నువ్వు వాసంతి అయితే ఓకే, శ్రీ సత్య అయితే కష్టం అని అనడంతోనే రేవంత్ టార్గెట్ చేసినట్లు శ్రీ సత్య… అర్జున్ మధ్య మంగళవారం ఎపిసోడ్ లో డిస్కషన్ జరిగింది.
ఈ క్రమంలో శ్రీ సత్య…అర్జున్ తో … నువ్వు వాసంతి నీ సిస్టర్ గా ఓకే చేసినప్పుడు నన్ను కూడా ఓకే చేయాలి కదా.. అనే డైలాగులు వేసింది. ఇద్దరినీ సిస్టర్ అని అప్పుడే ఓకే చేస్తే నిన్ను రేవంత్ టార్గెట్ చేసేవాడు కాదు. దీంతో అర్జున్ నీకు అసలు అర్థం కావడం లేదు అంటూ డిస్కషన్ వేరే వైపులా మార్చేశాడు మొత్తం మీద చూసుకుంటే సీజన్ సిక్స్ లో అర్జున్ మరియు శ్రీ సత్య మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.