Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గత సీజన్ ల కంటే కాస్త స్లోగా ఉన్నట్లు చూస్తున్న జనాలు చెబుతున్నారు. హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులు చాలామంది ఎక్కువగా గొడవలు పోకుండా చాలా రిజర్వ్ గేమ్ ఆడుతున్నట్లు చెబుతున్నారు. ఒక్క గీతు రాయల్ ఇంకా ఆదిరెడ్డి మినహా.. హౌస్ లో పెద్దగా గేమ్ ఆడుతున్న వాళ్ళు కనబడటం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే మొదటి వారం హౌస్ నుండి రేవంత్, చంటి, ఫైమా, సుల్తానా, అభినయశ్రీ, శ్రీ సత్య, ఆరోహి ఎలిమినేషన్ కి సెలెక్ట్ కావడం తెలిసిందే.
అయితే ఓటింగ్ పరంగా శుక్రవారం ఓటింగ్ పోల్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఓ కంటెస్టెంట్ ఒక్కసారిగా దూసుకుపోయినట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే సింగర్ రేవంత్ ప్రారంభంలో ఓటింగ్ లో మూడో స్థానంలో ఉండటం జరిగింది. ఆ సమయంలో మొదటి స్థానంలో లేడీ కమెడియన్ ఫైమా ఉన్నారు. కానీ అనుహ్యంగా శుక్రవారం ఓటింగ్ పోల్స్ ముగిసే సమయం వచ్చేసరికి ఇప్పుడు రేవంత్ మొదటి స్థానంలోకి వచ్చేయడం జరిగిందట. గత రెండు రోజులుగా హౌస్ లో రేవంత్ ని టార్గెట్ గా చేసుకుని అతని ఆవేశాన్ని మరింతగా రెచ్చగొడుతూ కొంతమంది కంటెంస్టెంట్ లు గేమ్ ఆడుతున్నారు.

ఇదే సమయంలో రేవంత్ కొన్ని సందర్భాలలో రెచ్చిపోయిన గాని ఆ తర్వాత వివరణ ఇస్తూ అందరితో కలిసి పోతున్నారు. ఈ పరిణామంతో రేవంత్ ఓటింగ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగినట్లు సమాచారం. ముందుగా మొదటి మూడు స్థానాలలో రేవంత్, ఫైమా, చంటి ఉండటం జరిగిందట. ఆ తర్వాత నాలుగో స్థానం నుండి శ్రీ సత్య, ఆరోహి, ఉండగా చివరిలో అభినయశ్రీ, సుల్తానా మధ్య ఫైట్ నడుస్తోంది. మరి ఫస్ట్ వీకెండ్ వచ్చేసిన నేపథ్యంలో మొదటి వారం హౌస్ నుండి ఎవరు ఎలిమెంట్ అవుతారో అన్నది సస్పెన్స్ గా మారింది.