Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో మొదటివారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి ఏడుగురు నామినేట్ కావడం జరిగింది. బుధవారం జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో రేవంత్, ఫైమా, సుల్తానా, చంటి, అభినయశ్రీ, ఆరోహి, శ్రీ సత్య నామినేట్ కావడం జరిగింది. అయితే బుధవారం సాయంత్రం ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాగానే ఏడుగురిలో లేడి కంటెస్టెంట్ కి భారీ ఎత్తున ఓట్లు పడుతున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే లేడీ కమెడియన్ ఫైమాకి భారీగా ఓట్లు పడుతున్నాయి. ఓటింగ్ ప్రక్రియలో అందరికంటే మొదటి స్థానంలో అధిక ఓట్లతో ఫైమా.. దూసుకుపోతున్నట్లు సమాచారం.

ఆ తర్వాత రేవంత్ ఉన్నట్లు చివరిలో శ్రీ సత్య ఇంకా సుల్తానా పోటీ పడుతున్నట్లు బయట టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఫైమా వచ్చిన నాటి నుండి తనదైన శైలిలో కామెడీ చేస్తూ అందరిని అలరించడం జరిగింది. కానీ మొదటివారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో చాలామంది ఆమెను టార్గెట్ చేశారు. అయినా గాని ఎక్కడ తగ్గకుండా.. తన వాదన వినిపించడం జరిగింది.

ఏది ఏమైనా హౌస్ లో స్ట్రాంగ్ కంటేస్టెంట్లు అని అనుకున్నా వారిని సైతం ఓటింగ్ లో ఫైమా.. వారిని వెనక్కినేట్టి ముందుకు వెళ్ళటం మొదటి స్థానంలో నిలవడం.. సంచలనం రేపుతుంది. చాలా వరకు చూస్తే మొదటివారం సుల్తానా లేదా శ్రీ సత్య ఈ ఇద్దరిలో ఒకరు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు ఆడియన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియలో చివరిలో ఈ ఇద్దరు పోటీ పడుతున్నట్లు.. చెబుతున్నారు. మరి మొదటివారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.