పాకిస్తాన్ తో భారత్ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడడం ఆపేయడంతో పిసిబి బాగా దెబ్బ తింది అందుకే సమయం దొరికినప్పుడల్లా ఆ దేశ క్రికెటర్ లు భారత్ పై విషం చిమ్ముతుంటారు.ఈ స్ట్రాటజీ ఎంత ప్రయత్నించిన వర్క్ అవుట్ కాకపోవడంతో తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఒక పక్క బెదిరిస్తూ మరో పక్క బ్రతిమిలాడుతూ సింపతీ గేమ్ ప్లే చేస్తుంది.సరిగ్గా ఇలాంటి సమయంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ ను ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా భారత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తుందని అందుకే బీసీసీఐకి వ్యతిరేకంగా వెళ్ళే సాహసం ఏ బోర్డు చేయాదని అన్నారు అలాగే ఇటీవల పాకిస్తాన్ టూర్ నుండి సెక్యూరిటీ రీజన్స్ అనే కారణంతో అర్ధాంతరంగా న్యూజిలాండ్ వెళ్ళిపోవడం,ఇంగ్లాండ్ తమ టూర్ ను క్యాన్సిల్ చేసుకోవడం చాలా బాధిస్తుందని అన్నారు.