Improve Memory: ఇప్పుడు మనందరం హైటెక్ యుగంలో ఉన్నాం. మనందరి జీవితాలు ఉరుకులు పరుగులమయంగా మారిపోయాయి. ఇప్పుడు చాలా మంది మతిమరుపు లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి మతిమరుపు సమస్య నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మతిమరుపుకు ఇలా చెక్ పెట్టండి..
హెల్త్‌లైన్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం.. మతిమరుపు సమస్య అనేది జన్యుపరమైన కారణాల వల్ల వస్తోందని తేలింది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అల్జీమర్స్ ఉంటే వారి వల్ల మనకూ మతిమరుపు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. హెల్తీ లైఫ్ స్టయిల్‌ను అలవాటు చేసుకుంటే సహజమైన రీతిలో జ్ఞాపకశక్తిని బలోపేతం చేసుకోవచ్చట.
మతిమరుపు నుంచి బయటపడేందుకు ఉపయోగపడే చిట్కాల్లో ధ్యానం ఒకటి. మెడిటేషన్ మన శరీరాన్ని ఆరోగ్యవంతం చేయడమే కాకుండా మెదడును ఒత్తిడి లేకుండా చేస్తుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది.
బీఎంఐను సరిచూస్కోండి
బరువును సరిగ్గా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) సరిగ్గా ఉంచుకుంటే అది మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. కాబట్టి వీలైనంత వరకు బరువును అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించాలి
తినే భోజనంలో కూడా పలు మార్పులు చేసుకోవాలి. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లలో ఒమేగా –3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో ఇతోధికంగా సాయపడతాయి. ఆల్కహాల్ కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకుంటే అది మన జ్ఞాపకశక్తి మీద తీవ్రంగా ఎఫెక్ట్ పడుతుంది. ఆల్కహాల్‌లో ఉండే న్యూరోటాక్సిక్ ప్రభావం.. జ్ఞాపకశక్తిని పెంచే మెదడులోని భాగాన్ని క్రియారహితం చేస్తుంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
Improve Memory:
చక్కెర ఎక్కువ తీసుకున్నా మంచిది కాదు. అది మన జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుందట. శరీరంలో విటమిన్ డీ స్థాయి తగ్గుతున్నా దాని ప్రభావం మనపై జ్ఞాపకశక్తిపై పడుతుందట. అందుకే విటమిన్ డీ కోసం పరీక్షలు చేయించుకుని.. సప్లిమెంట్లు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.