భారతీయ సినీ ప్రపంచంలో దేవదాసు సినిమాకి ప్రత్యేక స్తానం ఉంది. 1953 వ సంవత్సరంలో వినోదా పిక్చర్స్ పతాకంపై డి.ఎల్ నారాయణ నిర్మాణంలో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికి ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేసుకుంది. అంతలా అతని నటనతో ఆ పాత్రలో జీవించి సహజ నటనతో దేవదాసుగా చెరగని ముద్ర వేశారు మన అక్కినేని. ఈ సినిమా వచ్చి నేటికి సరిగ్గా 70 ఏళ్ళు అయింది.
ఇప్పటికీ దేవదాసు అంటే అక్కినేని, పార్వతి అంటే సావిత్రి అనేంతలా ఆ సినిమాలో జీవించారు విల్లు ఇద్దరు . ఈ సినిమా వాళ్ళ కెరీర్ ను కూడా ఒక స్థాయికి తీసుకెళ్లింది. అప్పటికే అక్కినేని కొన్ని హిట్ సినిమాల్లో నటించారు కానీ సూపర్ స్టార్ స్టేటస్ మాత్రం ఈ సినిమా తోనే వచ్చింది అని చెప్పాలి. .
కథాంశం- చిన్న తనం నుంచే దేవదాసు పై ఇష్టాన్ని పెంచుకొని, పరిస్థితుల కారణంగా వయసు మళ్ళిన పెద్దాయన నీ పెళ్ళి చేసుకొని.. దేవదాసు ప్రేమకు దూరంగా ఉంటూ తనలో తనే కుమిలి పోయే పాత్రలో సావిత్రి సహజమైన నటనలో, చిన్నతనం నుంచీ ప్రాణం గా ప్రేమించిన పార్వతి ఎడబాటును తట్టుకోలేక.మద్యానికి బానిసై ప్రాణ త్యాగం చేసిన అక్కినేని, అతన్ని మర్చిపోలేక చివరి వరికి అతని చూడలేక కుప్పకూలుతుంది పార్వతి . ఆ ఇద్దరి పాత్రలు.. ప్రేక్షకులచే కన్నీళ్లు తెప్పించాయి.
అప్పటికి.. ఇప్పటికీ స్వచ్చమైన ప్రేమ కథా చిత్రాల్లో అక్కినేని, సావిత్రి ల దేవదాసు కు ప్రత్యేకమైన స్థానం ఉంది.