Immanuel-Varsha : బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎందరో కమెడియన్స్ పరిచయమయ్యారు. వారిలో ఇమ్మాన్యుయేల్ ఒకరు. నిజానిక వర్ష అనే యువతి లేకుంటే ఇమ్ము అంత పాపులర్ అయ్యేవాడు కాదేమో. వర్ష, ఇమ్మూ ఆన్‌స్క్రీన్ కెమెస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రష్మి, సుధీర్‌ల జోడి తర్వాత దాదాపు ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జంట వీరిద్దరే అనడంలో సందేహం లేదు. ఇద్దరూ జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ వీరిద్దరూ అలరిస్తున్నారు.
ఏ షోలో అయినా వీరిద్దరు జతకట్టి ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య కూడా ఒకానొక సమయంలో మనస్పర్ధలు వచ్చాయి. దీంతో విడిపోయిన ఈ జంట.. ఆ తరువాత ఒక షోలో కలిశారు. ఇప్పుడు తిరిగి ఎప్పటి మాదిరిగానే అలరిస్తున్నారు. ఆ మధ్య మనస్పర్థల కారణంగా దూరంగా ఉన్న ఈ ఆన్‌స్క్రీన్ జోడి ఇటీవల ఓ షోలో కలిసిపోయారు. ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలిసి చక్కగా ప్రేక్షకులను అలరిస్తున్నారు.ఈ నేపథ్యంలో వర్ష బర్త్‌డేకు ఇమ్మాన్యుయేల్ ఆమెకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
అయితే వర్ష బర్త్ డే ఇప్పుడే కాదు లెండి.. డిసెంబర్‌లో. పుట్టినరోజుకు కొద్ది రోజుల ముందే వర్షను స్వయంగా వర్షని హైదరాబాద్‌లోని ప్రముఖ జ్యువెల్లరి షాప్‌కు తీసుకెళ్లి ఆమెతో షాపింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని వ్లాగ్ చేసి తన యూట్యూబ్ చానల్లో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నిజానికి వర్షకు నెక్లెస్ కొనిచ్చేంత సీన్ ఇమ్మూ దగ్గర లేదు. ఇంతకు ముందు చేసిన ఒక వీడియోలో తనకు టీవీ, ఏసీ కొనే స్తోమత లేకుంటేనే జబర్దస్త్ కంటెస్టెంట్ రోహిణి కొనిచ్చిందని.. చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తన యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ కోసమే ఇమ్మూ ఈ వీడియో చేసినట్టు తెలుస్తోంది.