ఇలియానా… టాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారు ఉండరు. స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘకాలం పాటు తన హవాని కొనసాగించిన ఈ అమ్మడు తెలుగులో మంచి ఫేమ్ ఉండగానే బాలీవుడ్ లో అవకాశాలు అంటూ పరుగులు పెట్టింది. ఇక అక్కడికి వెళ్ళాక అడపాదడపా సినిమాలు చేసింది. అయితే అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. టాలీవుడ్ ప్రేక్షకులు ఇలియానాకి స్టార్ హీరోయిన్ గాస్థానం కలిపించి అభిమానించారు. అయితే బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం హిందీలో ఇలియానా అనే ఒక హీరోయిన్ ఉందనే విషయాన్నీ కూడా పట్టించుకోలేదు.
ఇక అప్పుడప్పుడు తన హాట్ అందాలు ఆరబోస్తూ బికిని ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేసిన పెద్దగా బాలీవుడ్ దర్శకులని ఆకట్టుకోలేకపోయింది. కొంత కాలం విదేశీ బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగింది. తరువాత ఏమైందో అతనికి బ్రేక్ అప్ చెప్పేసింది. ఆ తరువాత కొంత కాలం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన అమ్మడు మళ్ళీ బ్యాక్ టూ సినిమా అంటూ అడుగు వేసింది. అయితే ముందు ఇచ్చినట్లు ఎవరూ ఆమెకి అవకాశాలు ఇవ్వలేదు. దీంతో పాటు బాడీ కంట్రోల్ లేకపోవడంతో బాగా లావైంది.
దీంతో తెలుగులో ప్రయత్నాలు చేసిన చేసిన అవకాశాలు రాలేదు. దీంతో సైలెంట్ అయ్యి అప్పుడప్పుడు బికినీ అందాలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా జల్సా 4కె థియేటర్స్ లో రీరిలీజ్ అయ్యింది. మరో వైపు పోకిరి కూడా 4కే మూవీ రీరిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ నేపధ్యంలో ఇలియానా టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ రెండు సినిమాలు ఇలియానా కెరియర్ లో బ్లాక్బస్టర్ హిట్స్ అనే సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమెని తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా గుర్తు చేసుకున్నారు.