టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ ఇలియానా. ఈ గోవా బ్యూటీకి తెలుగులో చాలా వేగంగా స్టార్ హీరోయిన్ క్రేజ్ వచ్చింది. అగ్ర హీరోలు అందరితో ఆడిపాడింది. ఇక కెరియర్ టాలీవుడ్ లో మంచి స్పీడ్ మీద ఉన్న సమయంలోనే అమ్మడు బాలీవుడ్ సినిమాలు అంటూ పరుగులు పెట్టింది. అక్కడ అడపాదడపా సినిమాలు చేస్తున్న బాలీవుడ్ దర్శకులు ఇలియానాని పెద్దగా గుర్తించలేదు. అందాల ప్రదర్శన చేసి, బికినీ లతో ఫోటోషూట్ లు చేసుకొని దర్శకుల చుట్టూ తిరిగిన ఏవో కొద్దిగా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం అయితే ఆమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవని చెప్పాలి.
క బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ అండ్రూ నిబోన్ తో ప్రేమలో పడి చెట్టపట్టాల్ వేసుకొని తిరిగింది. ఏకంగా పెళ్ళికి ముందే హనీమూన్ ట్రిప్స్ కి కూడా వెళ్లి భాగా ఎంజాయ్ చేసింది.అయితే సడెన్ గా బాయ్ ఫ్రెండ్ ఇలియానాకి హ్యాండ్ ఇచ్చేయడంతో అమ్మడు డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఇదే సమయంలో ఫిట్ నెస్ మీద శ్రద్ధ లేకపోవడంతో లావైపోయింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా చూడటానికి కూడా ఆమె ఫీచర్స్ పెద్దగా అనుకూలంగా లేవని చెప్పాలి.
ఇప్పుడు మరో ఫారిన్ బాయ్ ఫ్రెండ్ ని ఇలియానా లైన్ లో పెట్టింది. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోదరుడు కావడం విశేషం. స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రిటిషర్ అనే విషయం తెలిసిందే. అయితే ఆమె హీరోయిన్ అయ్యాక ఫ్యామిలీ అంత ఇండియాకి షిఫ్ట్ అయ్యారు. కత్రినా కైఫ్ సోదరుడు సబాస్తియాన్ తో ఇలియానా ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు టాక్. ఇదే విషయాన్ని కాఫీ విత్ కరణ్ షోలో కత్రిన కైఫ్ ని కరణ్ జోహార్ అడిగాడు. అయితే కత్రినా మాత్రం దైనికి సమాధానం చెప్పలేదు. దీంతో పాటు ఆ మధ్య కత్రినా బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఆమె ఫ్యామిలీతో పాటు ఇలియానా కూడా పార్టిసిపేట్ చేసింది. దీంతో ఇలియానా సినిమాలు పక్కన పెట్టి బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉందని బిటౌన్ లో వినిపిస్తున్న మాట.