YS : షర్మిల ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వివాదాస్పద ట్వీట్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. షర్మిల పాదయాత్ర సక్సెస్ కావడం లేదని, మీడియాలో అసలు హైలెట్ కావడం లేదని వైఎస్సార్ టీపీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పాదయాత్రకే మైలేజ్ వచ్చేందుకు, మీడియా దౄష్టి పడేందుకు పాదయాత్రలో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై దమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సదరు ఎమ్మెల్యేలు షర్మిలపై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
షర్మలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీపై ఆమె దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వైఎస్ కీలకంగా వ్యవహరించాని అన్నారు.
అలాంటి వైఎస్ చనిపోతే ఆయన దోషి అని ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం దారుణమని షర్మిల విమర్శించారు.వైఎస్ కు కాంగ్రెస్ వెన్నుపోటు పొడించిందని ఆరోపించారు. 30 ఏళ్లు కాంగ్రెస్ కు వైఎస్ సేవ చేశారని, రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చారని చెప్పారు. వైఎస్ చనిపోయిన సమయంలో హెలికాప్టర్ ప్రమాదంపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు చేయలేదని, ఆయన చనిపోయిన తర్వాత దోషి అని ఎప్ఐఆర్ లో నమోదు చేశారని షర్మిల విమర్శించారు. వైఎస్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు.
YS :
ఇప్పుడు చంద్రుడ ఇంద్రుడు అని కాంగ్రెస్ నేతలు పొగుడుతున్నారని, మళ్లీ ఇప్పుడు వైఎస్ ఫొటో పెట్టుకని ఓట్లు అడుగుతందా అని షర్మిల దుమ్మెత్తిపోశారు. వైఎస్సార్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదని, వైఎస్సార్ కు కాంగ్రెస్ ఖ్యాతిని తీసుకురాలేదని షర్మిల ఆరోపించారు.