Business: ప్రపంచంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిస్థితులు మొత్తం తారుమారాయిపోయాయి. ఉద్యోగాల విషయంలో ఎక్కడా కూడా నిలకడ కనబడటం లేదు. ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇటువంటి తరుణంలో చాలామంది వ్యాపారం చేయడానికి మొక్కుచూపుతు ఉన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చే వ్యాపారాల పట్ల చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ రీతిగా ఆలోచించేవారికి రోజు డబ్బులు తీసుకొచ్చే వ్యాపారం .. కొత్తిమీర వ్యవసాయం అని చెప్పవచ్చు.
ప్రస్తుతం బయట మార్కెట్లలో కూరగాయలకు ఆకుకూరలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. కరోనా రాకముందు తర్వాత ధరలు చూస్తే ఆకాశానికి భూమికి అన్నట్టు తేడా కనబడుతూ ఉంది. ఈ పరిణామంతో కొత్తిమీరకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. కేజీ కొత్తిమీర ధర సుమారుగా 500 రూపాయలు పలుకుతుంది. ఇక మార్కెట్ రేటు చూస్తే భారీగా పలుకుతుంది. కాబట్టి రోజు డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆలోచన కలిగిన వాళ్లకి కొత్తిమీర వ్యవసాయం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ప్రస్తుతం వర్షాలు కుండపోతగా పడుతున్న నేపథ్యంలో.. నీళ్ల గురించి కూడా పెద్దగా ఆలోచించిన అవసరం లేదు.
ఇంటి దగ్గరలో ఉండే ఖాళీ స్థలంలో లేదా ఎకరం భూమిలో కొత్తిమీర సాగు చేసి ప్రతిరోజు ఉదయాన్నే మార్కెట్ కి తరలించటం వల్ల మంచి ఆదాయం లభిస్తుంది. ఒకవేళ మార్కెట్ లో కొత్తిమీర కి పెద్దగా ధర లేని సమయంలో కూడా పంట ఎక్కడ వృధా కాదు. ఎందుకంటే కొత్తిమీర నుండి ఎలాగో ధనియాలు వస్తాయి. ఆ దానియాలను అమ్మిన, పొడి చేసి అమ్మిన.. లాభమే. ఈ పరిణామంతో ఇటీవల చిన్న మరియు సన్నకారు రైతులు ఎక్కువగా కొత్తిమీర వ్యవసాయాన్ని చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. రోజు డబ్బులు రావాలి.. అని ఆలోచన కలిగి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు కొత్తిమీర వ్యాపారం ద్వారా రోజువారీ లాభాలు పొందవచ్చు. పైగా నెల సారవంతమైనది కాకపోయినా గానీ చేతికి వంచే పంట. గింజలు వేసిన కొద్ది రోజులకే పంట చేతికి రావడం ద్వారా ఆదాయం కూడా తక్కువ సమయంలోనే తెచ్చిపెడుతోంది.