IBomma : ఐబొమ్మ.. సినీ ప్రియులకు ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీకి వచ్చిన కొత్త సినిమాలన్నింటినీ పైసా ఖర్చు లేకుండా ప్రేక్షకులకు అందిస్తుంది. అది కూడా హై క్వాలిటీతో అందజేస్తోంది. అందుకే ప్రేక్షకులు కూడా ఈ వెబ్‌సైట్‌కి బాగా కనెక్ట్ అయిపోయారు. డౌన్‌లోడ్ చేసుకోవడం కూడా చాలా సులభం కావడంతో చదువుకోని వాళ్లు సైతం ఐ బొమ్మలో సినిమాను వీక్షిస్తున్నారు. అందుకే ఐ బొమ్మకు ప్రేక్షకుల తాకిడి బాగా ఎక్కువే. అయితే తాజాగా ఐ బొమ్మ సినీ ప్రియులకు షాక్ ఇచ్చింది.ఇప్పటికే డౌన్‌లోడ్ ఆప్షన్ తీసేసిన ఐబొమ్మ తాజాగా శాశ్వతంగా తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి సినీ ప్రేమికులకు షాకిచ్చింది.
సెప్టెంబర్ 9నుంచి తమ ఇండియాలో తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు భవిష్యత్తులో తిరిగి వచ్చే ఆలోచన కూడా తేదని, తమకు ఎవరు మెయిల్స్ చేయొద్దని యూజర్స్‌ను కోరింది. ఇంతకాలం తమపై చూపించిన ప్రేమకు అభినందలు అని ఐబొమ్మ నిర్వహకులు చెప్పారు. ఎందుకు ఇలా చేస్తున్నామనేదానికి మాత్రం కారణం వెల్లడించలేదు. ఒక్కసారిగా తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ఐ బొమ్మ ప్రకటించడంతో సినీ ప్రియులు షాక్ అయ్యారు. ఎందుకు ఇంత సడెన్‌గా సర్వీసులను నిలిపివేయాల్సి వస్తోందంటూ పెద్ద ఎత్తున చర్చించుకున్నారు.
IBomma : ఐ బొమ్మకు సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించడం కొత్తేం కాదు..
హైక్వాలీటీ హెచ్‌డీ ప్రింట్‌తో కొత్త సినిమాలను ఫ్రీ అందుబాటులో ఉంచుతూ ఎంతో సినీ ప్రియులను ఆకట్టుకుంది ఐబొమ్మ. దీంతో ఇండియాలో ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించే యూజర్లు సంఖ్య భారీగా పెరిగిపోయింది. అయితే ఐ బొమ్మకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించడం ఇలా కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాగే ప్రకటించింది. ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం సినిమా డౌన్‌లోడ్ ఆప్షన్ తీసేసి ఆంక్షలు విధించింది. తాజాగా మరో కొద్ది రోజుల్లో పూర్తిగా సేవలను నిలివేస్తున్నట్లు వెల్లడించడంతో యూజర్స్ ఒక్కసారిగా కంగుతిన్నారు.