విజయ్ దేవరకొండ కామెంట్స్
విజయ్ దేవరకొండ సమంతతో ఖుషి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. సమంత న్యూయార్క్ కి వెళ్లిపోవడంతో, విజయ్ ఒంటరిగా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. జాతీయస్థాయిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ పెట్టారు విజయ్ దేవరకొండ. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చారు విజయ్.

తాను డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నానని చెప్పేశారు. అయితే సమాజంలో తనకి గౌరవం కావాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నట్లు విజయ్ దేవరకొండ చెప్పారు. అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి మంచి లైఫ్ని ఇవ్వాలి అని కూడా విజయ్ దేవరకొండ చెప్పారు. నాకు డబ్బే ముఖ్యం డబ్బు కోసం సినిమాలు చేస్తున్నాను. డబ్బులు కావాలి. సమాజంలో గౌరవం కావాలి. నన్ను అవమానిస్తే నేను క్షమించలేను. డబ్బే అన్నిటికంటే ప్రధానం. ధనం మూలం ఇదం జగత్ అని విజయ్ చెప్పిన మాటలు ప్రస్తుతం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.