Venuswami : రష్మిక చలనచిత్ర నటిగా అందరికీ సుపరిచితమే. తెలుగు, తమిళ భాషలలో నటించింది. 1996లో కర్ణాటకలోని వీరాజ్ పేట్ లో జన్మించింది. విద్యాభ్యాసం వీరాజ్ పేటలో కొనసాగించి తరువాత బెంగుళూరులో బ్యాచిలర్ డిగ్రీ చదివింది. 2016లో కర్ణాటక చిత్రమైన కిరిక్ పార్టీలో తొలిసారిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పేరుపొందింది.
ఆమె పాత్రకు ఉత్తమ నటిగా SIIMA అవార్డు సొంతం చేసుకుంది. తరువాత 2017లో అంజనీపుత్ర, చమక్ అనే రెండు కన్నడ చిత్రాలలో నటించింది. చమక్ చిత్రం ద్వారా ఆమె నటనకు ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. తర్వాత 2018లో విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. అది కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తరువాత మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది.
ఈ సినిమా అత్యధిక భారీ వసూళ్లు సాధించింది. తర్వాత వరుసగా భీష్మ, సుల్తాన్, పుష్ప సినిమాలలో నటించింది. ఆ తర్వాత సీతారామంలో కనిపించింది. రష్మిక కిరాక్ పార్టీలో తనతో నటించిన సహనటుడు రక్షిత్ శెట్టితో డేటింగ్ చేయడం.. 2017లో స్వస్థలమైన వీరాజ్ పేటలో ఒక ప్రైవేట్ పార్టీలో నిశ్చితార్థం చేసుకున్నారు. 2018లో కొన్ని కారణాల వల్ల నిశ్చితార్థాన్ని విరమించుకొని విడిపోయారు.
అయితే వేణు స్వామి అనే జ్యోతిష్య పండితులు ఇద్దరు జాతకాలు సరిగా లేవు విడిపోతేనే కెరీర్లో సక్సెస్ అవుతారు అని ముందుగా సూచించానని అన్నాడు. నా మాట ప్రకారం ఇద్దరూ విడిపోయి, రష్మిక కోసం తరువాత రాజాశం భవతా అనే పూజ చేశానని తెలిపాడు. ఇందులో కూడా మూడు రకాల పూజలు ఉంటాయని.. నేను ఇందులో ది బెస్ట్ అయినా పూజ చేసి ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ గా అవుతారని చెప్పానని.. అలాగే జరుగుతుందని అన్నాడు.
Venuswami :
భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలుస్తుందని చెప్పారు. అదికూడా యోగ్యం ఉంటేనే పూజలు జరిపిస్తానని కుత్తూ రమ్య అని కన్నడ స్టార్ ఎంపీగా గెలవడం జరిగింది. నా వద్దకు రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్ వచ్చి పూజలు చేయించుకుంటారు. చాలామంది సక్సెస్ అయ్యారని ఒక ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది.