మళ్లీ పెళ్లి ప్రీరిలీజ్ ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ.. మా అమ్మ నాతో నీకు మంచి లైఫ్ ఇవ్వలేకపోయాను అని చివరిలో అంది. ఇప్పుడు నేను ఇంకో అమ్మని కలిశాను అని చెప్పి కృష్ణ గారి ఆశీస్సులు తీసుకున్నాను.

ఫస్టాప్ బాగుంటే సెకండాఫ్ బాగుంటుంది. అదే ఈ సినిమా. కృష్ణ, విజయనిర్మలగారు నాకు ధైర్యాన్ని నేర్పారు. ఆ సమయంలో నా కుటుంబమంతా నా వైపు నిలబడింది.
మా అమ్మ ఓ దేవత. ఆమె నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. రీల్ లైఫ్ బాగున్నా రియల్ లైప్ బాగోలేదు. ఇప్పుడు 50 ఏళ్లకు మా అమ్మ తర్వాత ఇంకో అమ్మను కలుసుకున్నా పవిత్ర రూపం లో . పెండ్లి లో నమ్మకం, ఆప్యాయత, తోడును కోరుకుంటాం.
వృద్ధాప్యంలో బలాన్ని కోరుకుంటాం. అందుకే చివరికి నా గమ్యానికి చేరుకున్నానని చెప్పగలను.