Actor Sameer : సమీర్ తెలుగు చిత్ర నటుడు. ఈయన అందరికీ సుపరిచితుడే. ఈయన 1975లో విశాఖపట్నంలో జన్మించాడు. ఈయన అపర్ణ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మా టీవీ నిర్వహించిన మొగుడ్స్ పెళ్లామ్స్ ప్రోగ్రాంలో బెస్ట్ సెలబ్రిటీ కపుల్ గా ఎంపికయ్యారు. ఈయన ఋతురాగాలు అనే సీరియల్ లో సహాయ పాత్రలో నటించి తెరకు పరిచయమయ్యాడు.
ఇక 1995లో విడుదలైన శుభసంకల్పం సినిమా ద్వారా సినిమాలలోకి ప్రవేశించాడు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా వెళ్లాడు. హైదరాబాదులో నివాసం ఏర్పరచుకొని దాదాపు 50 సినిమాలలో సహాయక పాత్రలలో నటించి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.
ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని. పవన్ కళ్యాణ్ జీవితం గురించి దగ్గర నుండి చూసి గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. ముఖ్యంగా ఆయనకు ఓపిక అనేది ఎక్కువగా ఉంటుంది. సెట్ లో తక్కువగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరిని స్మైలింగ్ ఫేస్ తో పలుకరిస్తారు.
ఎవరికైనా సహాయం చేయాలంటే ఒక అడుగు ముందుంటారు. చాలావరకు మనం సంపాదించే వాళ్లను చూస్తూ ఉంటాం. సహాయం చేసే వాళ్లను తక్కువగా చూస్తూ ఉంటాం. ఏదైనా సహాయం చేయాల్సి వస్తే బ్యాంకు బ్యాలెన్స్ ఎంతుంది ఏంటి అని ఆలోచించకుండా వెంటనే ఏం కావాలో చేసేయని మేనేజర్లకు చెప్పడం చూసి నేను రెండు మూడు సార్లు ఆశ్చర్యపోయానని పేర్కొన్నాడు.
Actor Sameer :
చాలామంది బిజీగా ఉంటూ తమ కోసం తాము సమయం కేటాయించుకోవడం కష్టం కానీ ఆయన తనకంటూ పర్సనల్ లైఫ్ ఉండాలి అని ఎక్కువగా ఫామ్ హౌస్ లో మొక్కల మధ్యన, ఆవుల మధ్య ఉంటూ, నచ్చిన పుస్తకాలను చదువుతుంటారు. ఇలాంటి లక్షణాలు చిరంజీవి గారు లోను, నాగబాబు గారిలోను, ప్రకాష్ రాజ్ లోను దగ్గరుండి గమనించి మనుషుల్లో కూడా దేవుళ్ళు ఉంటారా అని అనుకున్నాను. ఎవరికైనా సమస్యలు ఉంటే అది నిజమో కాదో తెలుసుకొని కచ్చితంగా సహాయం చేస్తారు.