Hypertension : ప్రస్తుతకాలంలో దాదాపుగా ప్రతిఇంట్లో ఎవరో ఒకరు బీపీ సమస్యతో బాధపడుతున్నారు.ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించటమే ఈ హైపెర్టెన్షన్ సమస్య రావటానికి కారణం అని చెప్పుకోవచ్చు. ఈ హైబీపీ కంట్రోల్ లో ఉండకపోతే గుండెపోటు ,కిడ్నీ సమస్యలు ,కంటిచూపు దెబ్బ తినటం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బీపీని అదుపులో ఉంచుకోవటానికి బరువు తగ్గటం ,పోషకాహారం తీసుకోవటం ,క్రమం తప్పకుండా వ్యాయామం లాంటివి చేయటంలాంటివి అలవాటు చేసుకోవాలి. ఈ హైబీపీ ని కంట్రోల్ లో ఉంచుకోవటానికి కొన్ని బ్రేక్ ఫాస్ట్ రెసిపీ లు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
పెసర దోస :
హైపెర్టెన్షన్ పేషెంట్స్ పెసర పప్పు తో చేసిన బ్రేక్ ఫాస్ట్ తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే పెసరపప్పు లో పొటాషియం ,ఫైబర్ ,ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పెసర దోస తింటే రోజంతా వారి బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
రాజ్మా సలాడ్ :
రాజ్మా సలాడ్ చేయటానికి అరకప్పు ఉడికించిన రాజ్మాలో ఉల్లిపాయలు ,టమోటో, క్యాబేజి,స్ప్రింగ్ ఆనియన్ ,వాల్నట్ వేసి కలుపుకోవాలి. దీనిలో నిమ్మరసం ,మిరియాలు ,తగినంత ఉప్పు వల్ల మంచి రుచి చేకూరుతుంది. ఈ విధంగా చేసుకున్న రాజ్మా సలాడ్ బ్రేక్ ఫాస్ట్ హైపెర్టెన్షన్ పేషెంట్స్ కు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.
జొన్న రొట్టె :
జొన్నలో ఉండే పొటాషియం బీపీని నియంత్రించటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.అలాగే జొన్నలో మెగ్నిషియం ,కాపర్ ,క్యాల్షియమ్ ,జింక్, ఐరన్, ఆంటియాక్సిడెంట్స్ ,ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రక్తనాళాల్లో చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలస్ట్రాల్ పెంచటంలో జొన్నలు బాగా ఉపయోగపడతాయి. దీనివల్ల గుండె సంబంధిత సమస్యల ముప్పు నుండి తప్పించుకోవచ్చు. అలాగే జొన్నలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి .
Hypertension : కీరా రైతా :
కీరా రైతా మనల్ని హైడ్రేట్ గా ఉంచటానికి సహాయపడుతుంది మరియు టాక్సిన్స్ ను బయటకి పంపటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో వుండే పీచు పదార్థం జీర్ణ శక్తిని పెంచుతుంది. కాబట్టి ఈ కీరా దోస రోజు సలాడ్స్ లో భాగంగా తీసుకోండి.అలాగే పెరుగుతోపాటుగా తీసుకోవటంవల్ల బరువు అదుపులో ఉంటుంది.
ఈ విధమైన బ్రేక్ ఫాస్ట్ లు తినటం అలవాటు చేసుకుంటే హైపెర్టెన్షన్ అదుపులో ఉంచుకున్నట్టే.