Hyper Aadi : హైపర్ ఆది తెలుగు సినిమా నటుడు, స్క్రిప్ట్ రైటర్, జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ సుపరిచితమే. ఈయన 1990లో ప్రకాశం జిల్లాలోని చీమకుర్తిలో జన్మించాడు. ఈయన అసలు పేరు కోట ఆదయ్య. అందరూ ఆది అని పిలుస్తారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఈయన బీటెక్ పూర్తి చేశాడు.
కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసి నటనపై ఆసక్తితో షార్ట్ ఫిలింలలో నటించాడు. ఆయన జబర్దస్త్ షోలో స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసి, అదిరే అభి టీంలో నటుడిగా పరిచయమై, జబర్దస్త్ లో టీం లీడర్ గా ఎదిగాడు. 2017లో వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించాడు.
సినిమాలలో సహాయ పాత్రలతో, మరోవైపు జబర్దస్త్ తో బిజీగా రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి పాపులర్ అయ్యాడు. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన హైపర్ ఆదికి కాంపిటీషన్ గురించి ప్రశ్న ఎదురయ్యింది. దీంతో ఆయన ఈ విధంగా స్పందించాడు. ఎవరి లెక్క వారికి ఉంటుందని..తన స్కిట్లకు కూడా మిలియన్లలో లైక్స్ ఉన్నాయని, ఏదో ఓసారి సెంచరీ కొడితే సచిన్ టెండూల్కర్ ని క్రాస్ చేసినట్టు కాదని.. సచిన్ టెండుల్కర్ జీవితంలో చాలా సెంచరీలు ఉంటాయని అన్నాడు.
అలాగే ఇండస్ట్రీలో కూడా ఎవరి గురించి వాళ్లే చెప్పుకోవాలంటూ.. పెద్ద పెద్ద సినిమాలు హిట్ అవుతాయని తెలిసి కూడా ప్రెస్ మీట్ లు పెట్టి సినిమా గురించి చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం కదా అని అన్నాడు. అలాగే తన లెక్క తనకు ఉందని వివరించాడు హైపర్ ఆది. తనను క్రాస్ చేయాలంటే కష్టం అని, కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ లో కొనసాగడం మామూలు విషయం కాదని పేర్కొన్నాడు.
Hyper Aadi : వైరల్ గా మారిన హైపర్ ఆది వ్యాఖ్యలు..
సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర లాంటివాళ్ళు కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వ్యూయర్ షిప్ ను మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదని.. నాగబాబు గారు ఎక్కడున్నా అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తి అని హైపర్ ఆది పేర్కొన్నాడు. ఏదైనా కూడా కాంపిటీషన్ ఉంటేనే ముందుకు రావాలి అనే ఆలోచన ఉంటుంది అని తెలియజేశాడు. ఇక ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.