జబర్దస్త్ రియాలిటీషో ద్వారా నటిరోజా బుల్లితెరపై బాగా పాపులర్ అయ్యింది. ఓ విధంగా చెప్పాలంటే ఆమెని ప్రతి ఒక్కరికి దగ్గర చేసింది జబర్దస్త్ షో అని చెప్పాలి. రాజకీయంగా కూడా ఆమె ఇమేజ్ పెరగడానికి ఆ షో ఒక కారణం అయ్యిందనే మాటని గతంలో రోజా కూడా వ్యక్తం చేసింది. రియాలిటీ షో ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటికి తాను రీచ్ అయ్యాననిపేర్కొంది. ఇదిలా ఉంటే మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా జబర్దస్త్ నుంచి వీడ్కోలు తీసుకుని పూర్తిగా రాజకీయ కార్యక్రమాలలో బిజీ అయిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా అవకాశం దొరికిన ప్రతిచోట రకరకాల కార్యక్రమంలో పాల్గొంటూ తన ఐడెంటిటీ చూపించుకుంటుంది. ఇక రియాలిటీ షోలు, సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసి రాజకీయ వ్యవహారాల పైన శ్రద్ధ చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో దసరా ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. దీనికి సంబంధించిన తాజాగా రిలీజ్ చేశారు. ఈ షోలో ఆమెకి సన్మానం చేస్తూ ఉండగా చివర్లో హైపర్ ఆది ఏవో పంచ్ లు ఆమెపైయధావిధి గావేశాడు. దానిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకి ఆహ్వానించి నన్ను ఆహ్వానిస్తారా అంటూ సీరియస్ అయింది. తర్వాత అక్కడి నుంచి సీరియస్ గాలేచి వెళ్ళిపోయింది. ఆ సంఘటనతో అక్కడున్న వారంతా నిర్గాంతపోయారు. దీనికి సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో విడుదల చేయగా అది కాస్త వైరల్ అయింది.
అయితే ఇదంతా షోలో భాగంగా చేసిన డ్రామాగా అందరూ భావిస్తున్నారు. గతంలో కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ ఇలాంటి సీరియస్ స్కిట్స్ చేసి కాస్త హడావిడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా కేవలం ప్రోమో కటింగ్ కోసం మాత్రమే అనే టాప్ వినిపిస్తుంది. అయితే ఒక మంత్రి హోదాలో ఉండి జనాలు తప్పు దోవ పట్టించే విధంగా ఇలాంటి స్కిట్స్ చేయడంపై కొంతమంది నటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే టెలివిజన్ లో ఇవన్నీ షరా మామూలే అనే విషయం అందరికి తెలిసిందే. మొత్తానికి ఈ స్కిట్ తో దసరా రోజు ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ మంచి టిఆర్పి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.