Hyper Aadi: ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తూ ఉంటుంది. అందులో ప్రసారమయ్యే స్కిట్లు, డైలాగులు ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతీసేవిగా ఉంటాయని చెబుతుంటారు. చాలా మందికి ఎంటర్‌టైన్‌మెంట్‌గా నిలుస్తుండడంతో ఈ షోలో వచ్చే కాంట్రవర్సీలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదనేది వాస్తవం. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కాస్త వివాదాలు ముదురుతుంటాయి.
మొదటి నుంచి యాంకర్‌గా ఉన్న అనసూయ ఈ షో నుంచి తప్పుకోవడం కూడా కలకలం రేపింది. ఇక రేష్మి కొనసాగుతోంది. అయితే, ఈ షో వల్ల చాలా మంది పాపులర్ అయ్యారు. పేరు ప్రఖ్యాతలు గడించి సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. సుడిగాలి సుధీర్ లాంటి వారు ఏకంగా హీరోలుగా అవతరించారు. సుధీర్ హీరోగా రీసెంట్‌గా గాలోడు మూవీ వచ్చింది.
అయితే, జబర్దస్త్‌లో ఎంట్రీలు, ఎగ్జిట్‌లు సర్వ సాధారణం. ఇక ఈ షోకి కొత్త యాంకర్‌గా సౌమ్యరావు అనే కన్నడ బ్యూటీ ఈ మధ్యే వచ్చి చేరింది. రెండు వారాలు గడిచిపోయాయి. ఆమె మాత్రం తన మార్క్ చూపించే ప్రయత్నం కొనసాగిస్తోంది. మరోవైపు హైపర్ ఆది మాత్రం ఆమెపై మరీ ఎక్కువగా రెచ్చిపోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి జరిగింది. ఇప్పుడు ఆ షోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు హైపర్ ఆదిపై మండిపడుతున్నారు.
Hyper Aadi: కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తామంటూ..
ఇటీవల కాలంలో రెండు వారాలుగా సౌమ్యరావుపై హైపర్ ఆది పంచులేస్తున్నాడు. ఫస్ట్ ఎపిసోడ్ లోనే సౌమ్య, సేమియా అని రెచ్చిపోయాడు. ఇక లేటెస్ట్ ప్రోమోలో అంతకు మించి చేస్తున్నాడని అర్థమవుతోంది. తాజా ప్రోమో చివర్లో జడ్జి కృష్ణ భగవాన్.. అందరూ చనిపోయి ప్రపంచంలో మీ ఇద్దరే మిగిలితే ఏం చేస్తారంటూ హైపర్ ఆదిని ప్రశ్నిస్తాడు. ఇందుకు హైపర్ ఆది.. తామిద్దరం కలిసి కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తాం, వరసగా ఒకరి తర్వాత మరొకరిని కంటాం.. అంటూ బదులిస్తాడు. ఊహించని ఈ పరిణామానికి ఎలా స్పందించాలో తెలీక సౌమ్య తలదించుకుంటుంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆదిపై మండిపడుతున్నారు.