Hyderabad : హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. స్విగ్గీ డెలివరీ ఏజెంట్ ఫుడ్ డెలివరీ చేస్తుండగా కస్టమర్ పెంపుడు కుక్క వెంటాడడంతో భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. 23 ఏళ్ల మొహమ్మద్ రిజ్వాన్ జనవరి 11న బంజారాహిల్స్‌లోని లుంబినీ రాక్ కాస్టెల్ అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్తు లో నివాసముంటున్న కస్టమర్ కు ఫుడ్ డెలివరీ కోసం వెళ్ళాడు. అప్పుడు అతని పెంపుడు జంతువు జర్మన్ షెపర్డ్ బ్రీడ్ కుక్క పరిగెత్తుకుంటూ స్విగ్గీ డెలివరీ బాయ్ పై దాడి చేసింది. ఈ దాడిలో డెలివరీ బాయ్ బిల్డింగ్ పైనుంచి దూకి పడిపోయాడు.

పోలీసుల కథనం ప్రకారం, రిజ్వాన్ కస్టమర్ తలుపు వద్ద కనిపించినప్పుడు, కుక్క అతనిపైకి దూసుకెళ్లింది. కుక్క నుంచి తప్పించుకునే ప్రయత్నం లో రిజ్వాన్ రైలింగ్ నుండి దూకడానికి ప్రయత్నించాడు, కానీ జారి పడిపోయాడు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుక్క యజమాని అతదీని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్యం నిమిత్తం చేర్చాడు. మెడికల్ అబ్సర్వషన్ లో ఉన్న బాధితుడు ఆదివారం మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి కుక్క యజమానిపై బాధిత కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసారు.