హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది.పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం సాధించిన అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఇప్పటివరకు జరిగిన రెండు రౌండ్స్ లోనూ షాక్ తగిలింది.
మొదటి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 4610 ఓట్లను సంపాదించి 166 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచారు.తర్వాత స్థానంలో టీఆర్ఎస్‌కు 4444 ఓట్లతో నిలవగా, కాంగ్రెస్‌కు 119 ఓట్లతో తరువాత స్థానంలో నిలిచింది.ఇక రెండో రౌండ్ లో బిజేపి 193 ఓట్ల ఆధిక్యతను కనబరుస్తూ మొదటి స్థానంలో కొనసాగుతుంది.తర్వాత స్థానంలో టీఆర్ఎస్ ఆతర్వాత స్థానంలో కాంగ్రెస్ కొనసాగుతున్నాయి.