Huma Qureshi : బాలీవుడ్ నటి హుమా ఖురేషి ప్రస్తుతం తాను నటించిన ఇటీవల విడుదలైన మోనికా ఓ మై డార్లింగ్ చిత్రం విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన నటి, రాజ్‌కుమార్ రావు, సికందర్ ఖేర్ , ఇతరు నటులతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది. ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది అయిన హుమా, తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తాను ఇటీవల చేసిన ఫ్యాషన్ ఫోటో షూట్‌లలోని కొన్ని చిత్రాలను పంచుకుంది. మరోసారి మోనికా ఓ మై డార్లింగ్ వైబ్‌లను అందించింది.

హుమా ఫ్యాషన్ డిజైనర్ హౌస్ రివాల్వ్‌కు మ్యూజ్ ప్లే చేసింది , తాజా ఫోటో షూట్ కోసం డిజైనర్ హౌస్ షెల్ఫ్‌ల నుండి ప్రకాశవంతమైన అద్భుతమైన కో-ఆర్డ్ సెట్‌ను ఎంచుకుంది. ఈ అవుట్ ఫిట్ లో కత్తి లాంటి లుక్స్ తో యూత్ కి పిచ్చెక్కించింది హుమా.

హుమా స్వీట్‌హార్ట్ నెక్‌లైన్, ఫుల్ స్లీవ్స్, డ్రమాటిక్ షోల్డర్ లు కలిగిన వెల్వెట్ పింక్ టాప్‌లో మెరిసిపోయింది. ఈ క్రొపెడ్ టాప్‌ని బ్లాక్ పెన్సిల్ స్కర్ట్‌తో జత చేసింది . ఈ స్కర్ట్ కి వచ్చిన లాంగ్ స్లిట్ హుమా అందాలని ఎలివేట్ చేసాయి.

హుమా గోల్డెన్ , రెడ్ హూప్ ఇయర్ రింగ్స్ ను చెవులకు అలంకరించుకుంది. చేతివేళ్లకు గోల్డెన్ ఉంగరాన్ని పెట్టుకుంది. పాదాలకు క్లాసిక్ బ్లాక్ ఫుట్ వేర్ వేసుకుని తన రూపాన్ని పూర్తి చేసింది.

ఫ్యాషన్ స్టైలిస్ట్ సనమ్ రతాన్సీ హుమా కు స్టైలిష్ లుక్స్ ను అందించింది. తన కురులతో క్లీన్ పోనీటైల్ ను వేసుకుంది. కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ వింగేడ్ ఐలైనర్, కనురెప్పలకు మస్కారాను దిద్దుకుంది. కనుబొమ్మలను హైలెట్ చేసి పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ ను పెట్టుకుని తన గ్లామరస్ లుక్స్ తో అందరిని మంత్రముగ్ధులను చేస్తోంది.

Advertisement