Huma Qureshi : బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి ప్రస్తుతం ఆమె ఇటీవల విడుదలైన మోనికా ఓ మై డార్లింగ్ చిత్రం విజయంతో దూసుకుపోతోంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి విమర్శకుల వరకు అందరి ప్రశంసలను అందుకుంది. ఈ క్రమంలో ఫ్యాషన్‌స్టార్ అయిన హుమా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఇటీవలి చేసిన ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని చిత్రాలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.

Huma Qureshi : ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యాషన్ ఫోటోషూట్లను చేస్తూ అభిమానులను అలరిస్తుంది హుమా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉమా తన ఇంస్టాగ్రామ్ ఫ్యామిలీని అలరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. అంతే కాదు ఫ్యాషన్ ప్రియులకు లేటెస్ట్ ఫ్యాషన్ గోల్స్ ను అందిస్తుంది. సీజన్ కు తగ్గట్లుగా అకేషన్ కు సెట్ అయ్యే విధంగా అవుట్ ఫిట్ లు ధరిస్తూ మంత్రముగ్ధులను చేస్తుంది ఈ మాయలేడి. తాజాగా చేసిన ఫోటోషూట్ పిక్స్ కూడా ఫాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం హుమా షిఫాన్ చీరను ధరించింది. పండుగ సీజన్ కోసం ఫ్యాషన్ లక్ష్యాలను నిర్దేశించింది. హుమా నారింజ, పింక్ షేడ్స్‌లో పూల నమూనాలను కలిగి ఉన్న తెలుపు, నారింజ రంగు షిఫాన్ చీరనుఎంచుకుంది. ఈ చీరను అంతే అందంగా కట్టుకుని తన హాట్ లుక్స్ తో అలరించింది హుమా.
హుమా తన చీరను అదే పాటర్న్స్ లో రంగులో వచ్చిన మ్యాచింగ్ బ్లౌజ్‌తో జత చేసింది. తెల్లటి అలంకారాలతో వచ్చిన ఫుట్ వేర్ చీరకు సెట్ అయ్యేలా ధరించింది.

ఐ యామ్ వెరీ వెరీ సారీ, అని హుమా తన చిత్రాలకు క్యాప్షన్ ఇచ్చింది. హుమా పిక్స్ కు నెట్ ఇంట్లో లైకుల వర్షం కురుస్తోంది . మోనికా ఓ మై డార్లింగ్ సహనటి రాధికా ఆప్టే చాలా అందంగా ఉన్నావ్ అని రెడ్ హార్ట్ ఎమోటికాన్‌ను జోడించి మెచ్చుకుంది.

హుమా తన చీరకు తగ్గట్లుగా మినిమల్ మేకప్ లుక్‌ని ఎంచుకుంది. న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, కను రెప్పలకు మస్కరా వేసుకుని పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని హుమా ఎథ్నిక్ లుక్‌ను పర్ఫెక్ట్‌గా మార్చింది. ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది.
