Huma Qureshi : స్టైలిష్ గౌన్ లు వేసుకుని పాపం బోర్ కొట్టిందేమో హుమా ఖురేషీ చీర కట్టుతో చంపేస్తోంది. ట్రెండీ అవుట్ ఫైట్స్ ను పక్కన పెట్టి ట్రేడిషనల్ మంత్రాన్ని జపిస్తోంది. తాజాగా ఓ అవార్డు వేడుక కోసం హుమా స్టన్నింగ్ బ్లాక్ చీర కట్టుకుని అందరిని మెస్మరైజ్ చేసింది. ఆ చీరకట్టుతో రెడ్ కార్పెట్ పైన అదరగొట్టింది హుమా .ఈ చీరతో దిగిన హాట్ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.

Huma Qureshi : లోకమత్ అవార్డ్స్ 2022 లో పాత్ బ్రేకింగ్ అవార్డును సొంతం చేసుకుంది హుమా ఖురేషి. ఈ వేడుకకు నలుపు రంగు చీరతో వెళ్లి అందరి చూపును తన వైపు తిప్పుకుంది హుమా ఖురేషి. ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ వేసుకుని సాంప్రదాయబద్దంగా చీర కట్టుకుని రెడ్ కార్పెట్ పైన సందడి చేసింది. మిగతా బాలీవుడ్ స్టార్లంతా క్లీవేజ్ షో చేస్తూ ఎక్సపోసింగ్ డోస్ పెంచుతూ అదిరిపోయే స్టైలిష్ మోడ్రెన్ డ్రెస్సుల్లో తళుక్కు మంటే హుమా మాత్రం వారికి భిన్నం గా చీర కట్టుకుని అదరగొట్టింది.

ప్రముఖ క్లాతింగ్ లేబల్ జె జె వాలయ కలెక్షన్స్ నుంచి ఈ శారీ ని ఎన్నుకుంది హుమా. చూడడానికి చాలా సింపుల్ గా ఉన్న దీని ధర వింటే షాక్ అవుతారు . ఈ శారీ కాస్ట్ అక్షరాలా రూ. 37 వేలు . నోమద్ సిరీస్ ప్రింటెడ్ శారీ అని జె జె వాలయ ఆఫీషియల్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.

క్లాసిక్ బ్లాక్ శారీ కి జోడిగా డీప్ వీ నెక్ లైన్ తో వచ్చిన ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ వేసుకుంది. తన లుక్ ను మరింత ఎఫెక్టివ్ గా కనిపించేందుకు చెవులకు ట్రైబల్ ఆక్సిడైజ్డ్ భారీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది

హిందీ , తమిళం, మరాఠి , మలయాళం చిత్ర పరిశ్రమల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది హుమా ఖురేషి. రీసెంట్ గా అలియా భట్ హీరోయిన్ గా చేసిన గంగూభాయ్ చిత్రం లో దిల్ రుబాగా కనిపించి అందరిని మెప్పించింది. తమిళం లో వలిమై చిత్రం లో నటించి అదరగొట్టింది. ఓ వైపు సినిమాల్లో బిజీ గా ఉంటూనే మరోవైపు తన సోషల్ మీడియా ఫాన్స్ ను ఇలాంటి ఫోటోలు పెట్టి ఇంప్రెస్స్ చేస్తుంటుంది.