Hruthik Roshan : బాలీవుడ్ స్టార్ హీరో, బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ గురించి ఆంగ్ల మీడియా ఓ ఆసక్తికర న్యూస్‌ను వెలువరించింది. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన హృతిక్.. రెమ్యూనరేషన్ విషయంలో ఇండియాలోనే టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ గ్రీకువీరుడి పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయమే ఇప్పుడు బీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. సింగర్ సబా ఆజాద్‌తో హృతిక్ రిలేషన్‌లో ఉన్నట్లు కొంతకాలంగా ఓ న్యూస్ బాలీవుడ్ సర్కిల్‌లో తెగ వైరల్ అవుతోంది.
నిజానికి హృతిక్ 2000 సంవత్సరంలోనే ఇంటీరియర్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ సుస్సానే ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సుసానేకు 2014లో హృతిక్ విడాకులు ఇచ్చేశాడు. అనంతరం కొన్నేళ్ల పాటు ఒంటరి జీవితాన్ని అనుభవించిన హృతిక్.. ఆ తరువాత సబా ఆజాద్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు కథనాలు వచ్చాయి. కొన్నేళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నప్పటికీ ముంబైలోని వేర్వేరు ప్రాంతాల్లోనే ఉండేవారు. కానీ తాజాగా వీరిద్దరూ కలిసి ఉండటం కోసం హృతిక్ ఓ బంగ్లను కొనేశాడట.
సబా ఆజాద్‌తో కలిసి ఉండేందుకు హృతిక్ రెండు అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశాడని ఆంగ్ల మీడియా వెల్లడించింది. దాని ఖరీదు ఏకంగా రూ.100 కోట్లని కథనంలో పేర్కొంది. ఆ ఇంటికి అదిరిపోయే వ్యూ ఉంటుందట. బీచ్ వ్యూతో ఇల్లు అద్భుతంగా ఉంటుందట. అన్ని హంగులతో కూడిన ఈ ఇల్లు 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందట. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని ఆంగ్ల మీడియా వెల్లడించింది. ఈ ఇంటి కొనుగోలు వ్యవహారంతో హృతిక్, సబా ఆజాద్‌ల రిలేషన్ మరోసారి బీటౌన్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. హృతిక్ ప్రస్తుతం ‘ఫైటర్’లో నటిస్తున్నారు.