Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ టైటిల్ ఫేవరేట్ బరిలో మొదటి నుండి రేవంత్ పేరు వినపడుతున్న సంగతి తెలిసిందే. అంతకుముందే పలు సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొనడంతో పాటు “ఇండియన్ ఐడిల్” టైటిల్ కూడా.. రేవంత్ గెలవడంతో.. హౌస్ లో ఉన్న వారందరికంటే బయట మంచి స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది. ఇక బిగ్ బాస్ ఆటపరంగా చూసుకుంటే రేవంత్ పూర్తిగా మాస్క్ లేని గేమ్ ఆడుతున్నాడు అని చెప్పవచ్చు. ఎక్కడా కూడా స్ట్రాటజీలు వాడకుండా.. సేఫ్ గేమ్ ఆడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన చోట చెప్పేస్తూ, ఎవరి కౌంటర్ వారికి ఇచ్చేస్తున్నాడు.
అయితే మనోడు ఆట తీరుకి మొదటివారం మాత్రమే కాదు రెండో వారం నామినేషన్ ప్రక్రియలో హౌస్ లో చాలామంది టార్గెట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో ఫైమా… తాను గెలిచే పరిస్థితి లేకపోయినా మరోపక్క రేవంత్ గెలుపును అడ్డుకోవడం మాత్రమే కాదు చంటి గెలిచే రీతిలో చాలా తెలివిగా గేమ్ ఆడింది. ఈ క్రమంలో సంచాలక్ గా ఉన్న నేహా చౌదరి సైతం రేవంత్ కి వ్యతిరేకంగానే వ్యవహరించినట్లు.. ఆ టాస్క్ అయిపోయాక పలు సందర్భాలలో .. జరిగిన డిస్కషన్ లో ఇదే తేలింది.
రెండో వారం కేప్టెన్సీ ఛాలెంజింగ్ టాస్క్ కి సంబంధించి రూల్స్ సరిగ్గా చెప్పకపోవడంతో రేవంత్ గెలుపుని అడ్డుకునే తరహా.. రీతిలో హౌస్ లో సభ్యులంతా వ్యవహరిస్తూ ఉన్నారు. రెండు వారాల నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో ఇంటి సభ్యులంతా ఒకవైపు అయితే రేవంత్ మరోవైపు అన్న తరహాలో.. వాతావరణం ఉంది. అయినా గాని ఎక్కడ కూడా రేవంత్ కాంప్రమైజ్ కాకుండా గేమ్ ఆడుతూ ఉండటంతో… రేవంత్ గ్రాఫ్ ఉన్నకొద్ది బయట పెరుగుతుంది. రెండు వారాలలోనే బిగ్ బాస్ విన్నర్ సభ్యులంతా కలిసి డిసైడ్ చేసేసారని మరి కొంతమంది సీజన్ 6 హౌస్ లో వాతావరణంపై బయట విశ్లేషణలు చేస్తున్నారు.
నోట్: బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం rtvmedia.in, Rtv Telugu ని సబ్‌స్క్రైబ్ చెయ్యండి!