Bigg boss 6: బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు 10 వారం కూడా పూర్తి కాబోతోంది. ఇక ఈ వారం వీకెండ్ రానే వచ్చేసింది. ఇప్పటికే ఎలిమినేషన్ క్లారిటీ వచ్చేసింది. బాలాదిత్య, మెరీనా ఇవాళ ఎలిమినేట్ కాబోతున్నారని పక్కా సమాచారం. ఇక మరి హోస్ట్ నాగార్జున కూల్‌గానే ఉన్నారా? లేదంటే కంటెస్టెంట్స్‌కి కావల్సినంత గడ్డి పెట్టారా? అంటే కూల్‌గా ఉంటూ గడ్డి పెట్టారు.నేటి షోకి సంబంధించిన ప్రోమోను స్టార్ మా కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. మొదట రేవంత్‌కు పీకాల్సిన క్లాస్ నైస్‌గా పీకేశారు.
టాస్క్‌లో సంచాలక్‌గా ఫెయిల్ అవడం.. అలాగే కన్ఫ్యూజ్ అయిన విషయాలను నాగ్ ప్రస్తావించారు.ఇక ఆ తరువాత ఇనయ దగ్గరికి వచ్చారు. అయితే ఇనయ ఈవారం ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. గత వారం నాగ్ వచ్చినప్పుడు నీ పని నువ్వు చూసుకో.. పదే పదే సూర్య జపం చేయకు.. అతను బుజ్జమ్మతో చాలా హ్యాపీగా ఉన్నాడని చెప్పుకొచ్చారు.ఈ విషయాన్ని ఇనయా బాగా వంట పట్టించుకున్నట్టుంది. ఈ వారం మాత్రం సూర్య జపం చేయలేదు.
ఒక్క సూర్య జపం చేయకుంటే సరిపోదు కదా. టాస్క్‌ల్లో ఎప్పుడూ గెలవాలని ఉండదు. అందునా ఇనయ పెద్ద తోపు ప్లేయరేమీ కాదు. సింపథి అనేది లేకుంటే ఎప్పుడో బయటకు వచ్చేసేది. అలాంటి వ్యక్తి ఈ వారం ఓడిపోయిన వెంటనే మాటలకు పదును పెట్టింది. ఎఫ్ వర్డ్స్ తీసింది. దీనిపై నాగ్ కాస్త గట్టిగానే క్లాస్ పీకారు. ‘‘ఇనయ నీకు కోపం వచ్చినప్పుడు ఎందుకు మాటలు అలా వదిలేస్తున్నావ్? ఆటలో ఓడిపోతే ఫ్రస్టేషన్‌లో ఎఫ్ వర్డ్స్ అన్నీ వాడేస్తావా? నామినేషన్స్‌లో నువ్వు ఫైమాని ఏమన్నావో తెలుసా? ఫైమా ప్రొఫెషన్‌ని చాలా పర్సనల్‌గా మాట్లాడావని నాకనిపిస్తోంది. అడల్ట్ కామెడీ స్టార్ అని అన్నావు. అది చాలా పర్సనల్ కామెంట్. ఇనయ నిన్నేం అనాలి మేము చెప్పు’’ అని నాగ్ కడిగేశారు.