Biggboss 6 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 రెండో వారం కూడా పూర్తి కావొచ్చింది. ఇక శనివారం రానే వచ్చింది. తప్పొప్పుల చిట్టా ఇప్పేసి ఇవ్వవలిసిన వారికి ఇచ్చేసి.. ప్రశంసించవలిసిన వాళ్లను ప్రశంసించే ప్రోగ్రామ్ ఈరోజే ఉంటుంది. కాబట్టి ప్రోమో కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ప్రోమోను కాస్త ఆలస్యంగా విడుదల చేసింది స్టార్ మా. లేటుగా వస్తేనేం.. చాలా ఘాటుగా వచ్చేసింది. మొత్తానికి గేమ్ ఆడని వారిని ఒక్కొక్కరినీ హోస్ట్ నాగార్జున ఏకి పారేశారు. దుమ్ము దులిపేశారు.
కూర్చొని కబుర్లు చెబుతూ టైం పాస్ చేసేవారికి.. తిండి, నిద్ర తప్ప మరో ధ్యాసే లేని వారికి గట్టిగా ఇచ్చేశారు.చిల్ అవడానికి వచ్చారా? అంటూ కోటా కాస్తంత గట్టిగానే ఇచ్చారు. బాలాదిత్య, షానీ, సుదీప, శ్రీ సత్య, వాసంతి, మరీనా-రోహిత్, అభినయ, కీర్తి, శ్రీహాన్.. మైడియర్ నైన్ మీరు బిగ్‌బాస్ హౌస్‌కి ఆడటానికి రాలేదు. చిల్ అవడానికి వచ్చారు. తింటానికి, పంటానికి ఈ బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చాను అనుకుంటే బ్యాగులు సర్దుకుని బయటకు వెళ్లిపోవచ్చు. అంటూ కుండ బద్దలు కొట్టేశారు.
Biggboss 6 : నేను తప్పు చేశాను సర్.. మనసుతో ఆలోచించాను.. బుర్రతో ఆలోచించలేదు
‘నువ్వు ఆడటం కాదు.. అందరి ఆటను కూడా చెడగొడుతున్నావు’ అంటూ బాలాదిత్యను అన్నారో మరొకరిని అన్నారో తెలియదు కానీ.. ఈ మాటల తర్వాత మాత్రం బాలాదిత్య క్లారిటీ ఇస్తున్నట్టుగా అయితే బిగ్‌బాస్ చూపించారు. ‘నేను తప్పు చేశాను సర్. నేను మనసుతో ఆలోచించాను.. బుర్రతో ఆలోచించలేదు’ అని బాలాదిత్య చెప్పాడు. అయితే మనసు, బుర్ర కాదు బిగ్‌బాస్ హౌస్‌మేట్‌గా ఆలోచించు అంటూ నాగ్ హితబోధ చేశారు. మొత్తానికి ఒక్కొక్కరికీ బ్యాండ్ బాజా బారాత్ అయిపోయింది. ముఖ్యంగా ఈ ప్రోమోలో గేమ్ ఆడని వారి సంగతి మాత్రం చెప్పారు. ఇక గేమ్ ఆడి తప్పులు చేసిన వారి పరిస్థితి ఏంటో ఈ రోజు జరిగే ఎపిసోడ్‌లో చూడాలి.