Horoscope: సూర్యుడు తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఒక రాశి నుండి సూర్యుడు మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటే, దాని వల్ల చాలా రాశుల మీద సానుకూల లేదంటే ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీపావళి సమీపిస్తున్న సమయంలో ఈ నెల 17వ తేదీన సూర్యడు శుక్రుడి రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభం కలుగుతుందని జ్యోతిష్యం చెబుతోంది. అంతలా లాభపడే రాశులు ఏవో చూద్దాం.
మకరరాశి:
సూర్యుడు శుక్రుడి రాశి అయిన తులారాశిలోకి ప్రవేశించడం వల్ల మకరరాశి వారికి లాభం కలుగుతుంది. ఈ రాశి వారికి పెండింగ్ లోని అన్ని పనులు చకచకా పూర్తవుతాయి. కార్యాలయాల్లో వీరు ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. అన్నింటికి మించి వీరికి ధన లాభం కలుగుతుంది.
సింహరాశి:
సూర్యుడు రాశిని మార్చుకోవడం వల్ల సింహరాశి వారికి లాభం కలుగుతుంది. ఆగిపోయిన పనులను తిరిగి చక్కబెడతారు. ఆరోగ్యం మెరుగవుతుంది. కెరీర్ పరంగా వీరికి పురోగతి లభిస్తుంది.
వృషభరాశి:
ఈ రాశి వారికి ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదంటే జీతం పెరిగుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరిస్తారు.
Horoscope:
ధనస్సు రాశి:
సూర్యుడి సంచారం వల్ల ఈ రాశి వారికి మేలు కలుగుతుంది. కెరీర్ పరంగా ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులు పదోన్నతి పొందడం లేదంటే కొత్త బాధ్యతలను పొందుతారు. జీతాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు భారీ లాభాలను ఆర్జిస్తారు.