Honey For Men: భారతీయ సంప్రదాయంతో తేనెకు ఓ విశిష్టత ఉంది. భోజనంతోపాటు వైదిక క్రతులు, పూజల్లో ఈ ద్రవపదార్థాన్ని విశేషంగా ఉపయోగిస్తారు. తీపికి రారాజుగా పిలిచే తేనెను ఇష్టపడని వారుండరంటే నమ్మండి. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ తేనెను అమితంగా ప్రేమిస్తారు. చక్కెర ఎక్కువగా తింటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి తేనె లేదా బెల్లంను తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. బెల్లం కంటే తేనెతో ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని అంంటుంటారు.
చెడిపోని గుణం తేనె సొంతం
ఎన్ని సంవత్సరాలైన చెడిపోనిదిగా తేనెను చెప్పొచ్చు. కానీ రానురాను తేనెల్లో కల్తీలు ఎక్కువవ్వడంతో కొద్దిరోజులకే తేనె పాడైపోతోంది. కానీ స్వచ్ఛమైన తేనె మాత్రం ఎప్పటికీ చెడిపోదు. ఇలాంటి మంచి తేనెతో ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మరీ ముఖ్యంగా అబ్బాయిలు తేనెను తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యల బారి నుంచి బయటపడొచ్చు.
వీర్య కణాలను పెంచుతుంది
మరి, తేనెను తినడం వల్ల అబ్బాయిలకు ఎలాంటి సమస్యలు తగ్గుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచి శరీరానికి కావాల్సిన శక్తిని ఎక్కువ మోతాదులో అందిస్తాయి. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఎంతగానో దోహదపడతాయి. మతిమరుపు, న్యూరోడెజెనరేటివ్ లాంటి వ్యాధులను అధిగమించడానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. మగవారు తేనెను తీసుకోవడం వల్ల వీర్య కణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్) పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Honey For Men:
మలబద్దకానికి చెక్ పెట్టేస్తుంది..!
శృంగార జీవితం సాఫీగా సాగాలంటే పురుషులు తేనెను తగిన మోతాదులో తీసుకోవడం తప్పనిసరినట. వారానికి కనీసం ఒక్కసారైనా తేనెను తీసుకోవాలట. తేనె తాగడం వల్ల పురుషుల్లో ఎముకల కండరాలు బలపడతాయట. తేనెతో మలబద్దకం లాంటి సమస్యల నుంచి బయటపడొచ్చట. దీర్ఘకాలిక మలబద్దక సమస్యలతో బాధపడేవారు తేనెను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే తేనెను పరిమితికి మంచి తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి తగిన మోతాదులో తేనెను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండండి.