Honey Benefits: భారతీయుల ఇళ్లలో సాధారణంగా, ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది తేనె. ఆయుర్వేదంలో ఎన్నోరోగాలకు తేనె అద్భుతంగా పని చేస్తుందని, అనేక రోగాలు దరి చేరకుండా తేను రక్షణనిస్తుందని చెప్పబడింది. అదే సమయంలో హిందూ సంప్రదాయంలో తేనెకు ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.
తేనెలో ఎన్నో రకాలైన పోషకాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, పొటాషియం, సోడియం, కార్బోహైడ్రేట్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే తేనెను వైద్యపరంగా సూపర్ ఫుడ్ అని పిలుస్తుంటారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరానికి తక్షణమే శక్తిని అందించడానికి తేనెను వాడటం ఉత్తమం.
తేనెను అనేక రకాల సౌందర్య ఉత్పత్తుల తయారీలో కూడా వాడుతుంటారు. చర్మానికి తేనె ఎంతో మేలు చేస్తుంది కాబట్టి దీనిని వాడమని వైద్యులు కూడా సలహా ఇస్తుంటారు. అయితే ముఖం మీద నల్లటి మచ్చలతో బాధపడుతున్న వారికి తేనె ఎంతో అద్భుతం చేస్తుందని తెలుసుకోవాలి. నల్లమచ్చలను తొలగించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది.
Honey Benefits:
తేనెలో క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. అందుకే నల్ల మచ్చలు ఉన్న ప్రాంతంలో తేనెను రాస్తే, అవి పలుచబడతాయి. అలాగే కాలిన మచ్చలున్నా తేనెను వాడవచ్చు. కాలిన మచ్చలు క్రమంగా పలుచబడి, కొన్నాళ్లకు మాయమవుతాయి. తేనె వల్ల ఇలాంటి కాలిన మచ్చలు, నల్లటి మచ్చలు మాయమవడంతో పాటు ముఖానికి, చర్మానికి మెరుపు వస్తుంది. తేనెను నిమ్మరసంతో కలిపి రాసుకుంటే ఫలితంగా ఇంకా ప్రభావవంతంగా ఉంటాయి.