దర్శక దిగ్గజం రాజమౌళి పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ట్రెండ్ ఇప్పటికి కొనసాగుతుంది. ఆస్కార్ అవార్డుల రేసులో పోటీ పడుతున్న ఆర్ఆర్ఆర్ మూవీకి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు వచ్చాయి. రాజమౌళి కూడా ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తూ సినిమాకి భారీ హైప్ తీసుకొస్తున్నారు. ఎక్కడా తగ్గకుండా ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ దూసుకుపోతున్నారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్ బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రోర్ అవార్డులని ఈ సినిమా ఇప్పటికే సొంతం చేసుకుంది. ఇక అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో పలు చిత్రోత్సావాలలో ఈ సినిమాని ప్రదర్శిస్తూ ఉండటంతో హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలని కూడా సొంతం చేసుకుంటుంది.
ఇప్పటికే మార్వేల్ సిరీస్ లో ఐరన్ మెన్ సిరీస్ ని తెరకెక్కించిన దర్శకుడు సైతం ఆర్ఆర్ఆర్ తన ఫేవరేట్ మూవీ అని పేర్కొన్నారు. అలాగే పలువురు హాలీవుడ్ టెక్నిషియన్స్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటికి వరల్డ్ వైడ్ గా ఈ మూవీ టాప్ ట్రెండింగ్ సినిమాల జాబితాలో కొనసాగుతూ ఉండటం ఈ ఆర్ఆర్ఆర్ కి ఒటీటీలో ఏ స్థాయిలో ఆదరణ వస్తుందనే చెప్పొచ్చు. తాజాగా వండర్ విమెన్ లీడ్ యాక్టర్ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించింది. అలాగే రామ్ చరణ్ న్యూ లుక్ పై కూడా ట్వీట్ చేసింది. బ్లాక్ పాంథర్ సినిమాలో చేసిన ఫిమేల్ యాక్టర్ కూడా ఆర్ఆర్ఆర్ మూవీపై విచిత్రంగా ప్రశంసలు కురిపించింది.
తాజాగా ఆస్కార్ ఓటింగ్ కోసం జరిగే స్క్రీనింగ్ లో ఆర్ఆర్ఆర్ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇందులో మూవీ చూసిన హాలీవుడ్ నిర్మాత, పలు హాలీవుడ్ హర్రర్ చిత్రాలని నిర్మించిన జాసన్ బ్లుమ్ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది. నేను ఆర్ఆర్ఆర్ ఫిన్నింగ్ పిక్ తో వెళ్తున్నాను అని ట్వీట్ చేయగా ఇతర హాలీవుడ్ ప్రముఖులు సైతం దీనిని ఏకీభవిస్తూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ రావాలని ప్రతి భారతీయుడు ఇప్పుడు కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాని ట్విట్టర్ లో ప్రమోట్ చేస్తున్నారు.