Hina Khan : భారతదేశం విభిన్న సంస్కృతుల మేళవింపు. ఒక్కో రాష‌్ట్రంలో ఒక్కో రకం కట్టు బొట్టును అనుసరిస్తుంటారు మహిళలు. పూజలు, పండుగల విషయంలోనూ చాలా వ్యత్యాసాలుంటాయి. దక్షిణాదిలో భర్తలు చల్లంగా ఉండాలని వరలక్ష్మీ వ్రతాలు ఏ విధంగా పెళ్లైన మహిళలు చేస్తారో.. అదే విధంగా నార్త్‌లోనూ వివాహిత మహిళలు వారి సాంప్రదాయాల ప్రకారం కరవ్ చతుర్థి అని పిలవబడే కర్వా చౌత్ పండుగను జరుపుకుంటారు. పెళ్లైన స్త్రీ తన భర్త దీర్ఘాయువు కోసం ఆ రోజంతా చుక్క నీరు కూడా తాగకుండా కఠినమైన ఉపవాసాన్ని చేసి భర్త క్షేమం కోసం దైవారాధనలో మునిగితేలుతారు.

Hina Khan : కర్వా చౌత్ వేడుక సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులను, ఆభరణాలను, చేతినిండా మెహందీ పెట్టుకుని నూతన వధువులా కనిపిస్తారు. అందుకే కర్వా చౌత్ వచ్చిందంటే చాలు బాలీవుడ్ సెలబ్రిటీలు తమ సింగారానికి బోలెడంత సమయాన్ని కేటాయిస్తుంటారు. మరి ఈ కర్వా చౌత్‌కి తనదైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది బాలీవుడ్ భామ హీనా ఖాన్. క్లాసీ ఎల్లో కలర్ ఎత్నిక్ అవుట్‌ఫిట్‌ను వేసుకుని పండుగ ముందే సందడిని తీసుకువస్తోంది.

ఓ ఫోటో షూట్ కోసం హీనా ఖాన్ ఫెస్టివ్ వైబ్స్‌ను తీసుకువచ్చే విధంగా పసుపు రంగులో వచ్చిన క్రాపెడ్ బ్లౌజ్ , దోతీ స్టైల్ స్కర్ట్ దాని మీదకు కేప్ ధరించి అదరగొట్టింది. సాధారణంగా కర్వా చౌత్ లో చాలా మంది స్త్రీలు ఎరుపు రంగు దుస్తులను ధరిస్తుంటారు. దానికి భిన్నంగా హీనా ఖాన్ ఎల్లో కలర్ అవుట్‌ఫిట్‌ను కూడా వేసుకోవచ్చని ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది. పండుగల్లో మాత్రమే కాదు కొత్త పెళ్లి కూరుతు ఈ అవుట్‌ఫిట్‌ను ధరించి అమేజిక్ లుక్స్‌తో అదరగొట్టవచ్చు.

డీప్ స్వీట్‌హార్ట్ నెక్‌లైన్, సీక్విన్ వర్క్‌తో, మిడ్ బేరింగ్ హెమ్ లెన్త్ , స్ట్రాపెడ్ స్లీవ్స్, బాడీ హగ్గింగ్ ఫిట్‌తో వచ్చిన క్రాపెడ్ బ్లౌజ్‌ను వేసుకుంది హీనాఖాన్ ఈ బ్లౌజ్‌కు మ్యాచింగ్‌గా ప్లీటెడ్ డీటైల్స్‌తో వచ్చిన పసుపు రంగు దోతీ స్టైల్ స్కర్ట్ వేసుకుంది. తన లుక్ మరింత అట్రాక్టివ్‌గా ఉండేందుకు హీనా ఖాన్ జిగ్ జాగ్ ప్యాటర్న్ లో వచ్చిన సీక్విన్ అలంకరణలు , రఫెల్డ్ బార్డర్స్, ఆంకిల్ లెన్త్‌లో ఉన్న హెమ్‌ను వేసుకుని గ్లామర్ లుక్స్‌తో కుర్రాళ్ల మనసు దోచేసింది.

పండుగకు సిద్ధంగా ఉన్న దుస్తులను ధరించిన హీనా ఖాన్ అవుట్‌ఫిట్‌కి కాంట్రాస్ట్‌గా ఉన్న ముత్యాలతో డిజైన్ చేసిన చోకర్ నెక్‌లెస్‌ను మెడలో అలంకరించుకుంది. చేతి వేళ్లకు స్టేట్‌మెంట్ కుందన్ లతో వచ్చని ఉంగరాలను ధరించింది. తన కురులతో మధ్యపాపిట తీసి పోనిటెయిల్ వేసుకుంది. కనులకు సబ్టిల్ స్మోకీ ఐ ష్యాడో, కనురెప్పలకు మస్కరా, బుగ్గలను బ్లష్ చేసి , పెదాలకు మావీ లిప్ షేడ్ పెట్టుకుని తన హాట్ లుక్స్‌తో పిచ్చెక్కించింది.

