Hina Khan : బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ తన చీర కట్టు అందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేయడంలో బిజీగా ఉంది . సంపూర్ణ ఫ్యాషన్‌వాది అయిన ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీలలోని స్నిప్పెట్‌లతో రోజూ ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంది. తాజా గా హీనా ఆరు గజాల చీరను అలంకరించుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఈ చీరకట్టుతో అందమైన ఫోటోలు దిగి వాటిని ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ మూర్ఛపోయేలా చేసింది.

హీనా ఫ్యాషన్ డిజైనర్ హౌస్ రాజి రామ్నిక్‌కి మ్యూజ్ గా వ్యవహరించింది. ఈ డిజైనర్ హౌస్ షెల్ఫ్‌ల నుండి అద్భుతమైన పసుపు రంగు చీరని ఎంచుకుంది.

పింక్ , సిల్వర్ జరీ బార్డర్‌లను కలిగి ఉన్న పసుపు రంగు షిఫాన్ చీరలో హీనా దివినుంచి దిగివచ్చిన అప్సరసలా తళుక్కుమంది. పాస్టెల్ ఆకుపచ్చ పూల నమూనాలతో వచ్చింన ఈ సారీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

హీనా ఈ శారీ కి హాల్టర్ నెక్ లైన్ , చీరకు వచ్చిన డిజైన్ నమూనాలు కలిగిన బ్యాక్‌లెస్ వివరాలతో వచ్చిన మ్యాచింగ్ బ్లౌజ్‌తో జత చేసింది. మెడ వెనుక భాగంలో వచ్చిన ముడి వివరాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది.

ఈ ఎత్నిక్ లుక్ కి తగ్గట్లుగా హీనా తన మేడలో ఎమరాల్డ్ స్టోన్ డిటెయిల్స్‌తో డిజైన్ చేసిన స్టేట్‌మెంట్ సిల్వర్ నెక్ చోకర్ ను అలంకరించుకుంది. చెవులకు సిల్వర్ ఇయర్ స్టడ్‌లు పెట్టుకుంది. పసుపు , నీలం రంగు బ్యాంగిల్స్ చేతులకు వేసుకుని తన రూపాన్ని మరింత అట్రాక్టీవ్ గా మార్చుకుంది.

ఫ్యాషన్ స్టైలిస్ట్ సునాక్షి కన్సల్ రాథోడ్ హీనా ఖాన్ కు స్టైలిష్ లుక్స్ ను అందించింది. హీనా మెస్సి హెయిర్ స్టైల్ తో తలలో వైట్ కలర్ ఫ్లవర్ పెట్టుకుని అదుర్స్ అనిపించింది.

మేకప్ ఆర్టిస్ట్ సచిన్ సాల్వి సహాయంతో, హీనా తన అందానికి మెరుగులు దిద్దింది. కనులకు స్మోకీ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, కను రెప్పలకు మాస్కరాను వేసుకుంది. పేదలకు న్యూడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని తన గ్లామరస్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.
