Hina Khan : బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ తన అభిమానులను లేటెస్ట్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ తో ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. తనదైన ఫ్యాషన్ సెన్స్ తో ఇండస్ట్రీ లో పేరు సంపాదించుకుంది ఈ నటి. సింపుల్ , కంఫర్ట్ దుస్తులను ధరిస్తూ ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకట్టుకుంటుంది హీనా.

అకేషన్ కు తగ్గట్లుగా అవుట్ ఫిట్స్ ను ఎంపిక చేసుకుంటూ అదుర్స్ అనిపిస్తుంది. తాజా గా హీనా అద్భుతమైన లెహెంగా సెట్ ను ధరించి చేసిన ఫోటో షూట్ పిక్స్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. రాబోయే పండుగ సీజన్ కు ఫ్యాషన్ లక్ష్యాలను అందించింది.

Hina Khan : హీనా ఫ్యాషన్ డిజైనర్ షెహ్లా ఖాన్‌కు మ్యూజ్ గా వ్యవహరించింది. ఈ ఫోటో షూట్ కోసం డిజైనర్ షెల్ఫ్‌ల నుండి వెండి లెహంగా సెట్ ను ఎంచుకుంది.

డీప్ నెక్‌లైన్ వెనుక భాగంలో ముడి వివరాలతో వచ్చిన స్లిప్ సిల్వర్ బ్లౌజ్ ను వేసుకుని ఎప్పటిలాగే అద్భుతంగా కనిపించింది. సిల్వర్ రేషమ్ థ్రెడ్ డిజైన్స్ తో ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడిన పొడవాటి వెండి స్కర్ట్ ను ఆమె ఈ బ్లౌజ్ కి జత చేసింది.

గెహ్నా జ్యువెలరీ నుండి ఒక స్టేట్‌మెంట్ డైమండ్ నెక్లెస్ ను ఎన్నుకుంది క్యూరియో కాటేజ్ జువెలరీ నుంచి ఎంపిక చేసిన ఈ నెక్ల్స్ తో హీనా తన రూపాన్ని మరింత అందంగా మార్చుకుంది. చేతికి వెండి గాజులను కూడా జోడించి తన లుక్ ను మరింత అందంగా మార్చుకుంది.
