Hina khan : తన స్టైలిష్ లుక్ తో అందరి చూపులను తన వైపు తిప్పుకోగలదు బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సృష్టించుకుని ఫ్యాషన్ ప్రియులను అలరిస్తుంది ఈ బ్యూటీ. ఈ విషయంలో ఎప్పుడు హీనా ఖాన్ విఫలం కాలేదు. రీసెంట్ గా జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో మెస్మరైజింగ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చి కన్నులకు విందును అందించింది. ఈ అకేషన్ కోసం వేసుకున్న స్లీవ్ లెస్ సిల్క్ గౌన్ అందరి దృష్టిని ఆకర్షించింది. కుర్రాళ్ళ మనసులు దోచేసింది.

Hina khan : ఎత్నిక్ వేర్ నుంచి క్యాజువల్ అవుట్ ఫిట్స్ వరకు ప్రతి డ్రెస్సును తన ఫిగర్ కు పర్ఫెక్ట్ గా కనెక్ట్ చేస్తుంది ఈ బ్యూటీ. ఈ అకేషన్ కోసం కూడా అదిరిపోయే రెడ్ కార్పెట్ లుక్ ను అందించింది హీనా ఖాన్. లైట్ బ్లూ కలర్ లో పెర్ల్ డీటెయిల్స్ తో వైల్డ్ నెక్ లైన్ కలిగిన ఈ అవుట్ ఫిట్ లో ఎంతో హాట్ గా కనిపించింది. భుజాల మీదుగా అదే రంగులో ఉన్న దుపట్టాను వేసుకుని డ్రామాటిక్ లుక్ ని అందించింది.

అవుట్ ఫిట్ కి తగ్గట్టుగా మేకోవర్ అయ్యింది హీనా. చెవులకు మెరూన్ స్టోన్స్ తో డిజైన్ చేసిన డ్యాంగలర్ ఇయర్ రింగ్స్ ను పెట్టుకుంది. సిల్వర్ త్రెడ్స్ ను ఉపయోగించే తన జుట్టును అందంగా తీర్చిదిద్దుకుంది. కనులకు సిల్వర్ ఐ లిడ్స్, పెదాలకు మట్టి లిప్ షేడ్ దిద్దుకుని డివి మేకప్ తో అప్సరసలా అదరగొట్టింది ఈ చిన్నది.

ఈ అద్భుతమైన డిజైనర్ పీస్ ను సుప్రియ ముంజల్ అత్లీయర్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది హీనా ఖాన్. చెవులకు అలంకరించుకున్న ఇయర్ రింగ్స్ ను క్యూరియో కాటేజ్ జ్యువెలరీ డిజైన్స్ నుంచి ఎంపిక చేసుకుంది. పాదాలకు వేసుకున్న హీల్స్ ను టిస్టా షూస్ నుంచి సెలెక్ట్ చేసింది. సెలబ్రిటీ స్టైలిస్ట్ కన్సల్ సునాక్షి హీనకు స్టైలిష్ లుక్ ను అందించింది.

ఈ అవుట్ ఫిట్ తో అవార్డ్ ఫంక్షన్ లో సందడి చేయడమే కాదు. ఫోటోగ్రాఫర్ రిశబ్ తీసిన ఫోటోషూట్ పిక్స్ లు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. విభిన్న ఫోజుల్లో దిగిన ఈ పిక్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసి షి ఈజ్ సౌల్ సెక్సీ శ్షీ శైన్స్ డిఫరెంట్ అని క్యాప్షన్ ని జోడించింది. హీనా తన అందాలను ఆరబోస్తూ చేసిన ఈ ఫోటోలు కుర్రాళ్లకు మత్తెక్కించాయి. ఆమె అందాల పైనుంచి చూపు తిప్పుకోనీయకుండా చేశాయి.
